తొంభై కేజీల బరువున్నాను.. అన్నం తినకుండా ఉంటే బరువు తగ్గొచ్చా?

ABN , First Publish Date - 2022-03-11T18:56:23+05:30 IST

సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్రా అన్నీ ముఖ్యమే. సమతుల ఆహారమంటే శరీరానికి అవసరమైన పోషకాలని సరైన పాళ్ళలో తీసుకోవడం. దీని కోసం తగు మోతాదులో రకరకాల ధాన్యాలు, పప్పులు, మాంసాహారులైతే

తొంభై కేజీల బరువున్నాను.. అన్నం తినకుండా ఉంటే బరువు తగ్గొచ్చా?

ఆంధ్రజ్యోతి(11-03-2022)

ప్రశ్న: నాకు ఇరవై అయిదేళ్లు. తొంభై కేజీల బరువున్నాను. అన్నం తినకుండా ఉంటే బరువు తగ్గొచ్చని విన్నాను. అన్నం మానెయ్యడం మంచిదేనా?


- శ్రీరేఖ, విజయవాడ


డాక్టర్ సమాధానం: సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్రా అన్నీ ముఖ్యమే. సమతుల ఆహారమంటే శరీరానికి అవసరమైన పోషకాలని సరైన పాళ్ళలో తీసుకోవడం. దీని కోసం తగు మోతాదులో రకరకాల ధాన్యాలు, పప్పులు, మాంసాహారులైతే గుడ్లు, మాంసం, లేదా పాలు, పాల ఉత్పత్తులు, అన్ని రకాల కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ఏదైనా పోషకాన్ని పూర్తిగా మానేసినా లేదా అధికంగా తీసుకున్నా కూడా దీర్ఘకాలంలో సమస్యలొస్తాయి. అన్నం పూర్తిగా మానేసినప్పుడు దాని స్థానంలో వేరే ఏదైనా ధాన్యాన్ని తప్పని సరిగా తీసుకోవాలి. అన్నానికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు, గోధుమలు వంటి ధాన్యాలను వాడవచ్చు. బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఆ ఆహారాన్ని ఎంత మోతాదులో, ఏ సమయంలో తీసుకోవాలో తెలుసు కోవడమూ అంతే ముఖ్యం. ఆహారపు అలవాట్ల పరంగా పెద్ద మార్పులు చేసే ముందు వైద్యులు లేదా పోషకాహార నిపుణులను సంప్రదించడం మంచిది. వారి సలహా మేరకు మార్పులు చేసుకుంటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా నివారించవచ్చు. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-03-11T18:56:23+05:30 IST