Advertisement
Advertisement
Abn logo
Advertisement

బరువు తగ్గాలంటే...

ఆంధ్రజ్యోతి(11-03-2021)

క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, దోసకాయ, బ్రొకోలి, అవకాడొ, ఆలివ్‌ ఆయిల్‌, గ్రీన్‌ యోగర్ట్‌, మొలకలు, ఓట్స్‌, దంపుడు బియ్యం, తృణ ధాన్యాలు, యాపిల్స్‌, అరటిపళ్లు, బ్లూబెర్రీలు వంటి యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఫ్రూట్స్‌, కిడ్నీ బీన్స్‌, ఫ్యాటీ ఫిష్‌, వంటివి బాగా తినాలి.

  • సమతులాహారం తీసుకోవాలి. పీచుపదార్థాలు బాగా ఉండేలా చూసుకోవాలి. వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. షుగర్‌ డ్రింక్స్‌ తీసుకోవద్దు.
  • ప్రొటీన్లు బాగా ఉండే బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలి. అంటే తాజాగా ఉడకబెట్టిన గుడ్డు, స్మోకీ సాల్మన్‌ వంటివి తినాలి. ఉదాహరణకు రెండు ఉడకబెట్టిన గుడ్లు, సలాడ్‌, బ్లాక్‌ కాఫీ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే మంచిది. 
  • ఉద యంపూట వర్కవుట్లు చేయాలి. ఇతర వేళల్లో వ్యాయామాలు చేయడం కన్నా ఉదయం పూట వ్యాయామాలు చేస్తే 20 శాతం ఎక్కువగా క్యాలరీలు కరుగుతాయి. 
  • కార్డియో వ్యాయామాలు చేస్తే ఎంతో మంచిది. అంటే ర న్నింగ్‌, జాగింగ్‌, స్విమ్మింగ్‌, జుంబా, బ్రిస్క్‌వాక్‌, మెట్లు ఎక్కడం వంటివి. ఇంట్లో ట్రెడ్‌మిల్‌, స్టేషనరీ బైక్‌ మీద సైక్లింగ్‌ చేస్తే కూడా మంచిది. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌ కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • రెసిస్టెన్స్‌ వ్యాయామాలు చేస్తే కూడా శరీరానికి ఎంతో బలం వస్తుంది. ఇవి కండరాలను బలోపేతం చేస్తాయి. ఇందుకు వెయిట్‌లిఫ్టింగ్‌ మంచిది. డంబల్స్‌తో కూడా ఈ వ్యాయామం చేయొచ్చు.
  • కాఫీ లేదా గ్రీన్‌ టీ తాగితే మంచిది. ఈ రెండింటిలో ఉండే కెఫైన్‌ వల్ల బరువు తగ్గుతారు.
  • మిలటరీ డైట్‌  చేస్తే కూడా మంచిది. ఫాస్టింగ్‌, ఈటింగ్‌ రెండూ ఈ విధానంలో అనుసరిస్తారు. ఇలా చేయడం వల్ల తక్కువ క్యాలరీలే శరీరానికి అందుతాయి బరువు తగ్గించే హార్మోన్లు క్రమబద్ధీకరణ చెందుతాయి.
Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement