Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోషకాలు ఎక్కువగా అందాలంటే!

ఆంధ్రజ్యోతి(28-11-2020)

బరువు తగ్గేందుకు పాటించాల్సిన నియమాలు, ఆహార సూచనలు, సైకాలజిస్ట్‌ సలహాలను పూజా మఖీజా తన ‘ఈట్‌, డిలీట్‌’ పుస్తకంలో వివరించారు.


కూరగాయలను పచ్చిగా తింటే మంచిదా! ఉడికించి తింటే మంచిదా! లేదా జ్యూస్‌ చేసుకొని తాగితే మంచిదా! అనే సందేహం  మనలో చాలామందిలో ఉంటుంది. వీటిలో ఏ రూపంలో తిన్నా మంచిదే, అయితే జ్యూస్‌ చేసుకొని తాగితే ఎక్కువ లాభం అంటున్నారు న్యూట్రిషనిస్ట్‌, క్లినికల్‌ డైటీషియన్‌ పూజా మఖీజా. శరీరం వీటిని ఎలా గ్రహిస్తుందనే విషయాన్ని ఈమధ్యే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించారు. ఆమె ఏం చెబుతున్నారంటే...


‘కూరగాయల్లో ఉండే పోషకాలలో చాలావరకు నీటిలో కరిగే విటమిన్లే. ఆక్సిడేషన్‌ (గాలిలోని ఆక్సిజన్‌తో చర్య పొందడం) వల్ల విటమిన్లు తొందరగా నశిస్తాయి. కూరగాయలను ముక్కలుగా కోసే క్రమంలో వాటిలోని కొన్ని పోషకాలు పోతాయి.. అదేవిధంగా కూరగాయలను వండుతున్నప్పుడు ఆక్సిడేషన్‌, వేడి కారణంగా వాటిలోని మరికొన్ని పోషకాలు నశిస్తాయి. అంతేకాదు పచ్చి కూరగాయలను నమలడం, ఉడికించి తినడం వల్ల వాటిలోని లవణాలు, విటమిన్లు ఆలస్యంగా విడుదులవుతాయి.


దాంతో శరీరం వాటిని శోషణ చేసుకోవడ కూడా ఆలస్యం వుతుంది. అలాకాకుండా వెజిటబుల్‌ జ్యూస్‌ తాగడం వల్ల పోషకాలు, విటమిన్లు ఎక్కువగా అందుతాయి. శరీరానికి అందాల్సిన పోషకాలు చాలా తొందరగా లభిస్తాయి. ఒకే రకం అని కాకుండా పలు రంగుల్లో ఉండే కూరగాయల నుంచి రసం తీసి తాగితే పలురకా పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా రోజుకు ఒక గ్లాసు కూరగాయల రసం తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే రెండు వారాల్లోనే ఫలితం కనిపిస్తుంది. కురులు, చర్మం ఆరోగ్యంగా మారతాయి. రోగనిరోధకశక్తి, ఉత్సాహం పెరుగుతుందిత’’ అంటున్నారు పూజ. 


Advertisement
Advertisement