హరితహారం మొక్కల మధ్య కలుపుతీత

ABN , First Publish Date - 2020-10-01T10:21:55+05:30 IST

హరితహారంలో భాగంగా ఏడీఏ, ఉప వ్యవసాయ సంచాలకుల(రైతు శిక్షణ కేంద్రం) కార్యాలయాల్లో నాటిన మొక్కల మధ్యలో పెరిగిన

హరితహారం మొక్కల మధ్య కలుపుతీత

పాలమూరు, సెప్టెంబరు 30: హరితహారంలో భాగంగా ఏడీఏ, ఉప వ్యవసాయ సంచాలకుల(రైతు శిక్షణ కేంద్రం) కార్యాలయాల్లో నాటిన మొక్కల మధ్యలో పెరిగిన కలుపును సంచాలకులు బి.హుక్యానాయక్‌, బి.వెంకటేష్‌ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం తీశారు. మూడు నెలల కిందట మామిడి, జామ, దానిమ్మ, నిమ్మ, ఉసిరి, బాదం, టేకు మొ క్కలను నాటారు. వాటి మధ్యలో తులసి, వేప, చింత మొక్కలను నాటారు. ఆ మొక్కలన్నీ ఇప్పుడు పెద్దగా అయ్యాయి. కార్యక్రమంలో శ్యాంయాదవ్‌, మాధవి, తౌఫికొద్దీన్‌ పాల్గొన్నారు.


‘మద్యం విక్రయిస్తున్న దాబాలపై చర్యలు తీసుకోండి’

మహబూబ్‌నగర్‌: జిల్లాలో అనుమతి లేకుండా పలు దాబాల్లో మద్యం విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని, దాంతో లైసెన్స్‌లు చెల్లించి నిర్వహిస్తున్న బార్లు నష్టపోవాల్సి వస్తుందని బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి అన్నారు. అలాంటి దాబాలపై చర్యలు తీసుకోవాలని అసోసియేషన్‌ సభ్యులు ఎక్సైజ్‌ సీఐ బాలక్రిష్ణకు బుధవారం జిల్లా కేంద్రంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొవిడ్‌ కారణంగా ఏడు నెలలుగా బార్లు మూతపడ్డాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, బార్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో ఆ ప్రకారంగా నిర్వహిస్తున్నామన్నారు. దాబాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పర్మిట్‌ గదులు ఏర్పాటు చేయడంతో తామెంతో నష్టపోతున్నామన్నారు. రెంట్లు, విద్యుత్‌ బిల్లులు చెల్లించుకోలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, సభ్యులు భాస్కర్‌గౌడ్‌, శ్రీనివా్‌సరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-01T10:21:55+05:30 IST