ప్రమాదకరంగా వంతెన రోడ్డు మార్జిన్లు

ABN , First Publish Date - 2021-04-17T05:11:29+05:30 IST

ఏలూ రు నగరంలో కాల్వ వంతెన రోడ్డు జాయిం ట్‌ మార్జిన్లు ప్రమాద కరంగా ఉన్నాయి.

ప్రమాదకరంగా వంతెన రోడ్డు మార్జిన్లు
గూడ్స్‌ షెడ్డు రోడ్డులోని కాల్వ వంతెనకు దెబ్బతిన్న రోడ్డు మార్జిన్‌

ఏలూరు కార్పొరేష న్‌, ఏప్రిల్‌ 16 : ఏలూ రు నగరంలో కాల్వ వంతెన రోడ్డు జాయిం ట్‌ మార్జిన్లు ప్రమాద కరంగా ఉన్నాయి. తూర్పులాకుల నుంచి పడమరలాకుల వరకు గల ఏలూరు కాల్వ వంతెనకు పలు చోట్ల కాల్వకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రాకపోకలు సాగిం చేందుకు వీలుగా చిన్న వంతెనలను నిర్మించారు. ఈ వంతెనలు ఎక్కే భాగం లో, దిగే భాగం లోనూ రోడ్డు మార్జిన్లు గోతులమయమై ప్రమాదకరంగా దర్శ నమిస్తున్నాయి. రాత్రివేళల్లో ద్విచక్ర వాహనదారులు ఆదమరుపుగా ఈ రోడ్డు మార్జిన్ల వద్ద జారిపడి ప్రమాదాల బారిన పడుతున్నారు. కనీసం రోడ్డు వంతెన మార్జిన్‌ జాయింట్లు కూడా పూడ్చకపోతే ఎలా అంటూ పాలకులను ప్రజ లు ప్రశ్నిస్తు న్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని పాత బస్టాండ్‌ సెంటర్‌ వద్ద, వంగాయగూడెం సెంటర్‌ వద్ద, గూడ్స్‌ షెడ్డు రోడ్డులోని బంకు వద్ద, రైల్వేస్టేషన్‌ వద్ద గల వంతెనల రాకపోకల భాగంలోని రోడ్డు మార్జిన్లు పూడ్చా లని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-04-17T05:11:29+05:30 IST