అమరావతి పోరాటంపై వెబినార్..!

ABN , First Publish Date - 2020-12-05T01:08:20+05:30 IST

మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. అమరావతిని ఏపీ క్యాపిటల్‌గా ప్రకటించాలని అమరావతి రైతులు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమరావతిలో

అమరావతి పోరాటంపై వెబినార్..!

అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. అమరావతిని ఏపీ క్యాపిటల్‌గా ప్రకటించాలని అమరావతి రైతులు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమరావతిలో రైతుల పోరాటం ఎంత వరకు వచ్చింది? కోర్టుల్లో కేసుల సంగతేంటి? అదితర న్యాయపరమైన విషయాలపై, క్షేత్ర స్థాయి వాస్తవాలపై సమాచారం కావాలనుకునే వారికి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. అమరావతి పోరాటంపై సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాసరావు జూమ్‌లో వెబినార్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా ఈ వెబినార్‌లో పాల్గొనొచ్చని.. తద్వారా అమరావతి పోరాటంపై సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం ఈ వెబినార్ శనివారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభమవుతున్నట్టు చెప్పారు. అంతేకాకుండా మీటింగ్ ఐడి - 85411245428 పాస్ కోడ్ - helper ద్వారా వెబినార్‌లోకి లాగిన్ కావొచ్చని తెలిపారు. కాగా.. ఈ వెబినార్‌ను అమెరికాకు చెందిన హెల్పర్ ఫౌండేషన్ హోస్ట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. 


Updated Date - 2020-12-05T01:08:20+05:30 IST