Webcast: సిమాట్స్‌లో ప్రధాని మోదీ ప్రసంగం వెబ్‌కాస్ట్‌

ABN , First Publish Date - 2022-10-03T16:13:04+05:30 IST

ఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగిన 5జీ మొబైల్‌ సర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నగరంలోని ప్రముఖ కార్పొరేట్‌ విద్యా సంస్థ సిమాట్స్‌ (సవీత స్కూ

Webcast: సిమాట్స్‌లో ప్రధాని మోదీ ప్రసంగం వెబ్‌కాస్ట్‌

అడయార్‌(చెన్నై), అక్టోబరు 2: ఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగిన 5జీ మొబైల్‌ సర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నగరంలోని ప్రముఖ కార్పొరేట్‌ విద్యా సంస్థ సిమాట్స్‌ (సవీత స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌) స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది తిలకించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగాన్ని వెబ్‌కాస్ట్‌ చేశారు. ఈ ఇండియన్‌ కాంగ్రెస్‌ సదస్సులో 5జీ మొబైల్‌ సేవలను ప్రారంభించిన తర్వాత ప్రధాని కీలక ప్రసంగాన్ని సిమాట్స్‌ విద్యార్థులు వెబ్‌కాస్ట్‌ ద్వారా తిలకించే అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా సిమాట్స్‌ వైస్‌ ఛాన్సెలర్‌ డాక్టర్‌ ఎన్‌.ఎం. వీరయ్యన్‌, ఎస్‌ఎస్ఈ డైరెక్టర్‌ డాక్టర్‌ రమ్యా దీపక్‌ మాట్లాడుతూ, ఈ తరహా ఆవిష్కరణలు దేశ ఆర్థిక రంగంలో మరిన్ని అవకాశాలను అందుబాటులోకి తెస్తాయని పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-03T16:13:04+05:30 IST