గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేపై వెబ్ సిరీస్

ABN , First Publish Date - 2020-08-10T23:13:30+05:30 IST

ఎనిమిది పోలీసులను హతమార్చిన దూబే.. చివరికి పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని మ‌హంకాళి ఆల‌యం వ‌ద్ద దూబేను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి కాన్పూర్‌కు తరలిస్తుండగా..

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేపై వెబ్ సిరీస్

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కాన్పూర్‌లో పోలీసులపై కాల్పులు జరిపి పలువురిని పొట్టన పెట్టుకున్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేపై వెబ్ సిరీస్ తీయబోతున్నారు. గ్యాంగ్‌స్టర్‌ల బయోపిక్‌లను సినిమాలుగా తీసిన ఘటనలు అనేకం ఉన్నాయి. అండర్ వరల్డ్ డాన్ దావూదం ఇబ్రహీం నిన్నటి నయీం వరకు అనేక సినిమాలు వచ్చాయి. ఇలాంటి సినిమాలపై సినీ ప్రేక్షకులకు కూడా ఆసక్తి ఎక్కువ. బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు పూనుకున్నారు. శైలేష్ ఆర్.సింగ్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.


ఎనిమిది మంది పోలీసులను హతమార్చిన దూబే.. చివరికి పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని మ‌హంకాళి ఆల‌యం వ‌ద్ద దూబేను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి కాన్పూర్‌కు తరలిస్తుండగా కాన్వాయ్‌‌లోని ఓ కారు బోల్తా పడింది. ఇదే అదనుగా వికాస్‌ దూబే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో దూబే మృతిచెందాడు.

Updated Date - 2020-08-10T23:13:30+05:30 IST