జూన ఆరంభంలోనే నైరుతి

ABN , First Publish Date - 2021-04-17T06:07:10+05:30 IST

జిల్లాలోకి ఖరీఫ్‌ సీజనలో జూన ఆరంభంలోనే నె ౖరుతి పవనాలు ప్రవేశించనున్నాయి. సకాలంలోనే రుతుపవనాలు వస్తాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త అశోక్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు.

జూన ఆరంభంలోనే నైరుతి

సకాలంలో జిల్లాకు రుతుపవనాలు

ఖరీ్‌ఫలో సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశం

వాతావరణ శాస్త్రవేత్త అశోక్‌కుమార్‌


బుక్కరాయసముద్రం, ఏప్రిల్‌ 16: జిల్లాలోకి ఖరీఫ్‌ సీజనలో జూన ఆరంభంలోనే నె ౖరుతి పవనాలు ప్రవేశించనున్నాయి. సకాలంలోనే రుతుపవనాలు వస్తాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త అశోక్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. నైరుతి రుతుపవనాలు జూన ఆరంభం నుంచి సెప్టెంబరు వరకూ రాష్ట్రంలో కొనసాగుతాయన్నారు. జిల్లాకు కూడా సకాలంలో ఈ ఏడాది నైరుతి పవనా లు వస్తాయని సూచించారు. జిల్లాలో సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని సూచించారు. జూన, సెప్టెంబరు మధ్య 96 నుంచి 104 సె.మీ., వర్షపాతం నమోదయ్యే అవకాశముందన్నారు.


ఉష్ణోగ్రత వివరాలు

జిల్లాలో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలిలా.. బుక్కరాయసముద్రం, పామిడి 39. 7, గుత్తి, గుంతకల్లు 39.4, యాడికి, 39.2, తాడిమర్రి 38.9, నార్పల 38.8, పెద్దవడుగూరు, పుట్లూరు 38.7, గార్లదిన్నె, కొత్తచెరువు, వజ్రకరూరు, యల్లనూరు 38.5, కూడేరు 38.3, చెన్నేకొత్తపల్లి 38, కనగానపల్లి 37.7, రాప్తాడు, తలుపుల 37.6, ధర్మవరం 37.5, బొమ్మనహాళ్‌, రాయదుర్గం 37.4, ముదిగుబ్బ 37.3, శింగనమల 37.2, బత్తలపల్లి, నల్లమాడ 37.1, డి.హిరేహాళ్‌, పెనుకొండ, శెట్టూరులో 36.8, ఆగళి 36.5, బుక్కపట్నం, ఓబుళదేవరచెరువు 36.4, ఆత్మకూరు, నల్లచెరువు, సోమందేపల్లి 36.3, గాండ్లపెంట, రామగిరి 36.2, గుమ్మఘట్ట, హిందూపురం, కంబదూరు, ఉరవకొండ 36.1, కదిరి, కణేకల్లు, రొళ్ల 36, మిగిలిన ప్రాంతాల్లో 35 డిగ్రీల సెల్సియ్‌సలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.



Updated Date - 2021-04-17T06:07:10+05:30 IST