పలు రాష్ట్రాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన Rains..ఐఎండీ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-06-16T13:00:16+05:30 IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిస్తాయని...

పలు రాష్ట్రాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన Rains..ఐఎండీ హెచ్చరిక

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) గురువారం విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో వెల్లడించింది.ఢిల్లీ, హర్యానాలోని కొన్ని ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం, ఈదురు గాలులతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.ఉత్తర ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ (బవానా, ముండకా), సోనిపట్, ఖర్ఖోడా (హర్యానా)లోని కొన్ని చోట్ల, పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం కురవవచ్చని ఐఎండీ అధికారులు వివరించారు.రుతుపవనాల ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ఎండవేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. 


Updated Date - 2022-06-16T13:00:16+05:30 IST