తెలంగాణలో వాతావరణ సూచన

ABN , First Publish Date - 2021-04-14T19:56:46+05:30 IST

తెలంగాణలో వాతావరణం మారిందని, రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణలో వాతావరణ సూచన

హైదరాబాద్: తెలంగాణలో వాతావరణం మారిందని, రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాగల మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు తెలంగాణాలో చాలా ప్రదేశాలలో పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గురువారం కూడా తేలికపాటి  నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు. శుక్రవారం ఉరుములు, మెరుపులతో  కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొంది.

Updated Date - 2021-04-14T19:56:46+05:30 IST