దుస్తులు మీ ‘మూడ్స్‌’ని మారుస్తాయి!

ABN , First Publish Date - 2021-01-22T05:30:00+05:30 IST

రకరకాల దుస్తుల ధరించడంపై కొందరిలో అనాసక్తత ఉంటుంది. కానీ మనం వేసుకునే దుస్తులు, అనుసరించే ఫ్యాషన్లు, రంగులు,

దుస్తులు మీ ‘మూడ్స్‌’ని మారుస్తాయి!

రకరకాల దుస్తుల ధరించడంపై కొందరిలో అనాసక్తత ఉంటుంది. కానీ మనం వేసుకునే దుస్తులు, అనుసరించే ఫ్యాషన్లు, రంగులు, యాక్సెసరీలు రోజంతా మనల్ని హుషారుగా, ఆనందంగా ఉంచడంలో సహాయపడతాయి.


దుస్తులు మూడ్స్‌ను మార్చి యాక్టివ్‌గా ఉంచుతాయి.

మనలోని భావోద్వేగాలను ప్రతిఫలిస్తూ అందరిలో మనల్ని విలక్షణంగా నిలబెడతాయి. 

మనం వేసుకున్న దుస్తులు పరిస్థితులకు అనుగుణమైన మన మానసిక భావాలను  తెలియజేస్తాయి.

దుస్తుల ఫ్యాషన్లను ఫాలో అవుతుంటే కూడా హుషారుగా ఉంటాం. అందుకోసం ఫ్యాషన్‌ ఈవెంట్లకు వెళ్లనవసరం లేదు. మీరు ఇష్టపడే స్టైలే మీ ఫ్యాషన్‌ సిగ్నేచర్‌ ట్యూన్‌ అనుకుంటే ప్రతి రోజూ ఎంతో ఫన్‌గా, మజాగా, మరెంతో ఆసక్తిగా గడిచిపోతుంది. 

మూడ్‌ బాగా లేనప్పుడు కొందరు షాపింగ్‌ చేస్తుంటారు. అలాగే హుషారుగా లేనప్పుడు రోజూ వేసుకునే దుస్తులు అంటే చీర, పంజాబీ డ్రెస్‌ల లాంటివి కాకుండా వెరైటీగా జీన్స్‌ ప్యాంట్‌, టీషర్టుల లాంటివి వేసుకోండి. అది మీకు కొత్త లుక్‌ ఇవ్వడమే కాదు, వ్యక్తిగతంగా ఒక విలక్షణ అనుభూతిని మీరు ఫీలవుతారు. 

ధరించే దుస్తుల విషయంలో సెల్ఫ్‌-కేర్‌ అవసరం. చాలామంది ప్రస్తుతం వేసుకునే దుస్తులు స్టైలిష్‌గా ఉండాలనుకోవడం కన్నా అవి శరీరానికి సుఖం ఇవ్వాలని కోరుకుంటున్నారు. అందుకే మెత్తగా ఉండే ఫ్యాబ్రిక్‌, బాగా వదులుగా ఉండే దుస్తులు, బాక్సీ ఫిట్స్‌, రఫ్‌ ఫినిషింగులతో ఉన్న బట్టలను వేసుకుంటున్నారు. 


కొందరు ఒత్తిడి, యాంగ్జయిటీలతో ఉన్నప్పుడు పెద్ద సైజు స్వెట్టర్లను వేసుకోవడానికి ఇష్టపడతారు.  మందంగా ఉన్న దుస్తులు వేసుకున్నప్పుడు ఎంతో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు అనిపిస్తుందని వాళ్లు ఫీలవుతుంటారు. మృదువైన దుస్తులు వేసుకుంటే నిరాశకర, విసుగైన క్షణాల్లో కూడా మనం భౌతికంగా, మానసికంగా ఎంతో ప్రశాతంగా ఉన్నట్టు అనిపిస్తుందని ఇంకొందరి అభిప్రాయం. 

వార్డురోబ్‌లో కొన్ని ప్రత్యేక దుస్తులు ఎంతో భద్రంగా దాచుకుంటాం. వాటిని వేసుకున్నప్పుడు ఆందమైన జ్ఞాపకాలతో మనసు ఆహ్లాదంగా మారుతుంది. అవి మనసుకు ఎంతో సాంత్వననిస్తాయి. 

Updated Date - 2021-01-22T05:30:00+05:30 IST