Abn logo
Nov 10 2020 @ 00:51AM

మాస్క్‌ ధరిస్తున్నారా?

 మాస్క్‌ ధరించడం, ధరించే విధానం... రెండూ ముఖ్యమే! అయితే మాస్క్‌ ధరించే ముందు, తొలగించిన తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి.

 ఇరుకైన, గాలి చొరబడని ప్రదేశాల్లో, రిస్క్‌ గ్రూప్‌కు చేరువలో ఉన్నప్పుడు తప్ప, మిగతా సమయాల్లో ఫ్యాబ్రిక్‌ మాస్క్‌ ధరిస్తే సరిపోతుంది.

 ఫ్యాబ్రిక్‌ మాస్క్‌ మూడు పొరలదైతే రక్షణ ఎక్కువ!

 60 ఏళ్ల వయసు పైబడినవాళ్లు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వ్యాధిగ్రస్థ కుటుంబీకులతో గడిపేవారు తప్పనిసరిగా సర్జికల్‌ మాస్క్‌ వాడుకోవాలి.

 ధరించే మాస్క్‌... ముక్కు, నోరు, గడ్డాలను కప్పేలా ఉండాలి.

 లాలాజల బిందువులు గాల్లోకి ఎగసిపడే వీలున్న చికిత్సలు చేసే వైద్యులు ఎన్‌ 95, ఎన్‌ 99 మాస్క్‌లు మాత్రమే ధరించాలి.

 ఐదేళ్ల లోపు పిల్లలు మాస్క్‌లు ధరించవలసిన అవసరం లేదు.

 తమంతట తాము మాస్క్‌ ధరించడంతో పాటు, మాస్క్‌ ధారణ పట్ల అవగాహన కలిగిన 6 - 11 ఏళ్ల మధ్య వయసు పిల్లలు నాన్‌ మెడికల్‌ లేదా ఫ్యాబ్రిక్‌ మాస్క్‌లు ధరించవచ్చు.

 తీవ్ర వ్యాధులు కలిగిన పిల్లలు తప్పనిసరిగా మెడికల్‌ మాస్క్‌ ధరించాలి.

 చెవులకు సంబంధించిన వైకల్యం కలిగిన పిల్లలు మాస్క్‌ ధరించడం కష్టం. ఇలాంటి పిల్లలు ఫేస్‌ షీల్డ్‌ ధరించవచ్చు. అయితే ఈ షీల్డ్‌ గడ్డం దిగువ వరకూ పొడవు ఉండేలా చూసుకోవాలి.ఫ


Advertisement
Advertisement
Advertisement