విమాన సిబ్బందికి టాటా ఎయిర్ ఇండియా తాజా ఆదేశం

ABN , First Publish Date - 2022-02-14T17:13:00+05:30 IST

విమానాన్ని నడపడానికి ముందు కస్టమ్స్ క్లియరెన్స్ సత్వరం జరిగేలా తక్కువ ఆభరణాలు ధరించాలని ఎయిర్ ఇండియా తన క్యాబిన్ సిబ్బందిని కోరింది...

విమాన సిబ్బందికి టాటా ఎయిర్ ఇండియా తాజా ఆదేశం

సత్వర కస్టమ్స్ తనిఖీల కోసం తక్కువ ఆభరణాలు ధరించండి

న్యూఢిల్లీ : విమానాన్ని నడపడానికి ముందు కస్టమ్స్ క్లియరెన్స్ సత్వరం జరిగేలా తక్కువ ఆభరణాలు ధరించాలని ఎయిర్ ఇండియా తన క్యాబిన్ సిబ్బందిని కోరింది.జనవరి 27వతేదీన నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటాలు స్వాధీనం చేసుకున్న కొద్ది రోజుల తర్వాత ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత డ్యూటీ-ఫ్రీ షాపులను సందర్శించవద్దని తన సిబ్బందిని టాటా ఎయిర్ ఇండియా కోరింది.టాటా ఎయిర్ ఇండియా విమానాల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించడానికి ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇన్‌ఫ్లైట్ సర్వీసెస్ కోసం ఎయిర్ ఇండియా ఆఫీటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వసుధ చందనా చెప్పారు.కస్టమ్స్, భద్రతా తనిఖీలలో  జాప్యాన్ని నివారించడానికి క్యాబిన్ సిబ్బంది తప్పనిసరిగా తక్కువ ఆభరణాలు ధరించేలా ఏకరీతి నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఎయిర్ ఇండియా సూచించింది.


Updated Date - 2022-02-14T17:13:00+05:30 IST