హెల్మెట్‌ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి

ABN , First Publish Date - 2021-04-18T06:02:08+05:30 IST

ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసేటప్పుడు ప్ర తీ ఒక్కరు హెల్మెట్‌ ధరించాలని ఖానాపూర్‌ సీఐ శ్రీధర్‌ అన్నారు.

హెల్మెట్‌ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి
ఖానాపూర్‌లో హెల్మెట్‌ ప్రాధాన్యతను వివరిస్తున్న సీఐ శ్రీధర్‌

ఖానాపూర్‌, ఏప్రిల్‌ 17 : ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసేటప్పుడు ప్ర తీ ఒక్కరు హెల్మెట్‌ ధరించాలని ఖానాపూర్‌ సీఐ శ్రీధర్‌ అన్నారు. శనివారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఖానాపూర్‌లో ఎన్టీఆర్‌ చౌక్‌లో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి బయటపడేందుకు హెల్మెట్‌ ఏ విధంగా ఉపయోగపడుతుందో వాహనదారులకు వివరించారు. ఆయన వెంట స్థానిక పోలీస్‌సిబ్బంది ఉన్నారు. 

భైంసా క్రైం, ఏప్రిల్‌ 17 : భైంసా పట్టణ నిర్మల్‌ చౌరస్తా వద్ద భైంసా టౌన్‌ ఇన్స్‌పెక్టర్‌ సీఐ ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో శనివారం ఎస్సైలు గంగారాం, ఎండి గౌస్‌లు కలిసి నిర్మల్‌ చౌరస్తా వద్ద ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు. ట్రాఫిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మరియు రోడ్డుసేప్టీలో భాగంగా హెల్మెట్‌ లేని వాహనదారులకు హెల్మెట్‌ వినియోగంపై అవగాహన కల్పించారు. వారిచే హెల్మెట్‌ను కొనుగోలు చేయించడం జరిగినట్లు ఎస్సై తెలిపారు. 

కడెం, ఏప్రిల్‌ 17 : హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపటం ద్వారా ప్రాణా లను కాపాడుకోవచ్చని కడెం ఎస్సై కోదాడిరాజు అన్నారు. మండలంలోని కొండుకూర్‌ గ్రామ రహదారిపై జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు హెల్మెట్‌ వాడకంపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. హెల్మెట్‌ ధరిం చకుండా ద్విచక్రవాహనాలు నడుపుతున్న వాహనదారులకు ఫైన్‌ విధించ కుండా వారి చేతనే హెల్మెట్‌ కొనుగోలు చేయించారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్‌ ధరించాలని సూచించారు. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తమ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

దస్తూరాబాద్‌, ఏప్రిల్‌ 17 : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని ఎస్సై రాహుల్‌గైక్వాడ్‌ అన్నారు. ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు మండలంలోని మున్యాల్‌ గ్రామంలో వాహనదారులకు రోడ్డు నియమాలపై అవగాహన కల్పించారు. వాహనదారులు వాహనపత్రాలు తప్పకుండా కగిలి ఉండాలని, రోడ్డు నియమాలు తప్పని సరిగా పాటించాలని తెలిపారు. ముఖ్యంగా కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. భౌతికదూరం పాటిస్తూ మాస్క్‌ ధరించాలని సూచించారు. 


Updated Date - 2021-04-18T06:02:08+05:30 IST