Abn logo
Oct 17 2021 @ 00:25AM

కమిషనరేట్‌లో ఘనంగా ఆయుధ పూజ

ఆయుధ పూజ చేస్తున్న సీపీ దంపతులు

కోల్‌సిటీ, అక్టోబరు 16: రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో దసరా సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించారు. కమిషనరేట్‌ చంద్రశేఖర్‌రెడ్డి సతీసమేతంగా హాజరై ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం షమిపూజ నిర్వహించి జమ్మి ఆకును అధికారులు, సిబ్బందికి అందజేశారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ విభాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ శరత్‌చంద్రపవర్‌, డీసీపీ(అడ్మిన్‌) అశోక్‌కుమార్‌, ఏసీపీ సుందర్‌రావు, ఆర్‌ఐలు మధుకర్‌, శ్రీధర్‌, విష్ణు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.