ఇక్కడ కాన్పు చేయం.. అనంతపురం వెళ్లిపోండి..

ABN , First Publish Date - 2022-05-28T06:17:30+05:30 IST

పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనం. ఆమె ఓ గ్రామ సర్పంచ. పురిటినొప్పులతో ప్రభుత్వాస్పత్రికి కాన్పుకోసం వచ్చింది

ఇక్కడ కాన్పు చేయం.. అనంతపురం వెళ్లిపోండి..
గర్భిణి సర్పంచ సునందమ్మ

హిందూపురం టౌన, మే 27: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనం. ఆమె ఓ గ్రామ సర్పంచ. పురిటినొప్పులతో ప్రభుత్వాస్పత్రికి కాన్పుకోసం వచ్చింది. వైద్యులు మాత్రం ఎవరైతే మాకేంటి.. అనంతపురం వెళ్లాలంటూ రెఫర్‌ చేశారు. పెనుకొండ మండలం నాగలూరు గ్రామ సర్పంచ సునందమ్మ పురిటినొప్పులతో శుక్రవారం ప్రభుత్వాస్పత్రికొచ్చింది. అక్కడి వైద్యులు ఏమాత్రం దయ చూపలేదు. ‘ఇప్పటికే ఇద్దరు గర్భవతులు కాన్పుకోసం వేచి ఉన్నారు. మీరు అనంతపురం వెళ్లాలంటూ’ నిర్ధాక్షిణ్యంగా రెఫర్‌ చేశారు. సర్పంచ కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడే కాన్పు చేయాలని విన్నవించుకున్నారు. అయినా కనికరం చూపని వైద్యులు ససేమిరా అన్నారు. విధుల్లో ఉండాల్సిన గైనకాలజిస్టు.. అనంతపురం వెళ్లిపోండని వారికి ఉచిత సలహా ఇచ్చి, ఇంటికి వెళ్లిపోయారు. డ్యూటీలో ఉన్న నర్సుకూడా ఫోన లిఫ్ట్‌ చేయకపోవడంతో చేసేదిలేక అనంతపురం తీసుకెళ్లారు. సర్పంచ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఒక గ్రామ సర్పంచకే కనీస గౌరవం ఇవ్వలేదనీ, సామాన్యులు ఆస్పత్రికి వస్తే వైద్యం ఎక్కడ అందుతుందని వాపోయారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని విమర్శించారు.


Updated Date - 2022-05-28T06:17:30+05:30 IST