చదువే సంపద

ABN , First Publish Date - 2022-09-26T04:35:22+05:30 IST

చదువుకు మించిన సంపద ప్రపంచంలో ఎక్కడా లేదని, చదువుకున్న పిల్లలే దేశానికి పెద్ద సంపద అని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు.

చదువే సంపద
జ్యోతి ప్రజల్వన చేస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

-  చదువుకు మించిన సంపద ప్రపంచంలో ఏదీ లేదు  

-  మల్టీ జోన్‌ లెవల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను ప్రారంభించిన మంత్రి 

-  ఆట పాటలతో అలరించిన చిన్నారులు

గోపాల్‌పేట, సెప్టెంబరు 25 : చదువుకు మించిన సంపద ప్రపంచంలో ఎక్కడా లేదని,  చదువుకున్న పిల్లలే దేశానికి పెద్ద సంపద అని  మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. మండలంలోని బుద్దారం సంక్షేమ హాస్టల్‌లో మల్టీజోన్‌ లెవల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ దేశంలో అతి  సంపద కలిగిన వారు ఆదానీ, అంబానీలు అనే వార్తలు వింటుంటారు. కానీ నిజ మైన సంపద కళాశాలలు, పాఠశాలలు, విశ్వవిద్యా లయాల నుంచి వచ్చే మీరు మాత్రమే అన్నారు. ప్రభుత్వం అన్ని అవకాశాలు మీకు కల్పిస్తుంది కాబ ట్టి బాగా చదువుకోవాలని సూచించారు.  ప్రపంచం లో ఆర్థిక, రాజకీయ మేధావుల్లో అంబేద్కర్‌ ఒకరని గుర్తు చేశారు. చదువును ఎవరూ నిర్లక్ష్యం చేయ కూడదన్నారు. చదువంటే తరగతి గదుల్లో చదవడం, అర్థం చేసుకోవడం, ఆలోచించడం అని తెలిపారు.  ఆటల్లో గెలువడం ముఖ్యం కాదు ఆటల్లో పాల్గొన డమే ముఖ్యమన్నారు. 11 పాఠశాలల నుంచి ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు మంత్రి, కలెక్టర్లకు గురుకుల పాటశాల విద్యార్థులు స్వాగతం పలికారు. విద్యార్థులు ఆట పాటలతో అలరించారు. కార్యక్రమంలో  కలెక్టర్‌ యాస్మిన్‌బాషా, జడ్పీచైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు భార్గవి, ఎంపీపీ సంధ్య, సర్పంచ్‌  పద్మమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు శ్రీదేవి, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

 



Updated Date - 2022-09-26T04:35:22+05:30 IST