మీలో దీపం వెలిగించండి!

ABN , First Publish Date - 2020-03-06T05:53:39+05:30 IST

‘‘మీలో ఉన్న బలహీనతలను తొలగించుకోవడానికి అత్యుత్తమమైన మార్గం- వాటి గురించి ఆలోచించకపోవడమే! లేనట్టయితే మీరు వాటిలో..

మీలో దీపం వెలిగించండి!

‘‘మీలో ఉన్న బలహీనతలను తొలగించుకోవడానికి అత్యుత్తమమైన మార్గం- వాటి గురించి ఆలోచించకపోవడమే! లేనట్టయితే మీరు వాటిలో మునిగిపోతారు. మీ లోపల దీపాన్ని వెలిగించుకోండి, ఆ చీకటి ఎన్నడూ లేనట్టు మీకు అనిపిస్తుంది. నా జీవితానికి గొప్ప స్ఫూర్తిని ఇచ్చిన ఆలోచనల్లో ఇదొకటి. వేల సంవత్సరాల నుంచీ చీకటిలో మగ్గుతున్న ఒక గుహలోకి మీరు ఒక చిన్న దీపాన్ని తీసుకువెళ్లారనుకోండి, ఆ చీకటంతా అప్పటికప్పుడే మాయమైపోతుంది!  అలాగే ‘దైవం’ అనే జ్యోతిని మనలోకి తీసుకువస్తే మన తప్పులూ, లోపాలూ అన్నీ అదృశ్యమైపోతాయి. ‘నిర్లక్ష్యం’ అనే చీకటి ఇక ఎన్నడూ మీలో ప్రవేశించలేదు.’’

- పరమహంస యోగానంద

(రేపు పరమహంస యోగానంద వర్ధంతి)

Updated Date - 2020-03-06T05:53:39+05:30 IST