థ్యాంక్యూ మోదీ: ఇండియన్ మెడికల్ అసోసియేషన్

ABN , First Publish Date - 2021-07-30T00:24:24+05:30 IST

న్యూఢిల్లీ : అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో అఖిలభారత కోటాలో రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్వాగతించింది

థ్యాంక్యూ మోదీ: ఇండియన్ మెడికల్ అసోసియేషన్

న్యూఢిల్లీ : అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో అఖిలభారత కోటాలో రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్వాగతించింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారితో పాటు బలహీనవర్గాలవారు వైద్యవిద్యకు చేరువౌతారని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయలాల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డిప్లొమా, బీడీఎస్, ఎండీఎస్ కోర్సుల్లో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారికి 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దాదాపు 5,550 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్‌లో 1,500 మంది ఓబీసీలు, సుమారు 550 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు లబ్ధి పొందుతారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో దాదాపు 2,500 మంది ఓబీసీలు, 1,000 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు లబ్ధి పొందుతారు. 

Updated Date - 2021-07-30T00:24:24+05:30 IST