విశాఖపట్నం/అమరావతి, డిసెంబరు 4(ఆంధజ్యోతి): మన్నార్ గల్ఫ్‌లో కొనసాగుతున్న బురేవి తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారి తమిళనాడులోని పంబన్‌కు పశ్చిమ నైరుతి దిశలో కొనసాగుతోంది. ఇక, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో శుక్రవారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ తమిళనాడులో వాయుగుండం కొనసాగుతున్నందున ఏపీలోని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు.