చైనాతో అన్ని సంబంధాలను తెంచుకోగలం: ట్రంప్

ABN , First Publish Date - 2020-05-15T21:47:39+05:30 IST

రోనా విషయంలో అవసరమైతే చైనాతో అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకోవడానికి...

చైనాతో అన్ని సంబంధాలను తెంచుకోగలం: ట్రంప్

వాషింగ్టన్: కరోనా విషయంలో అవసరమైతే చైనాతో అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రసంగించిన ట్రంప్ ఈ విషయాన్ని వివరించారు. కరోనా వైరస్‌ ఇతర దేశాలకు వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో చైనా పూర్తిగా విఫలమైందని, అందువల్లే ప్రపంచ దేశాలు ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఇన్నాళ్లూ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, అయితే ఇప్పుడు అతడితో మాట్లాడడం కూడా తనకు ఇష్టం లేదని ట్రంప్ తెలిపారు.

Updated Date - 2020-05-15T21:47:39+05:30 IST