చివరి రక్తపుబొట్టు వరకు కష్టపడతాం

ABN , First Publish Date - 2021-10-17T05:44:57+05:30 IST

రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా సాలూరు నియోజకవర్గానికి అధినేత చంద్రబాబునాయుడు ప్రాధాన్యం ఇస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్టీ కోసం చివరి రక్తపు బొట్టు వరకూ కష్టపడతామని తెలిపారు. విజయదశమి రోజున ఆర్పీ భంజ్‌దేవ్‌కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇవ్వడంపై ఆమెతో పాటు క్యేడర్‌ కూడా అధినేతకు ధన్యవాదాలు తెలిపారు.

చివరి రక్తపుబొట్టు వరకు కష్టపడతాం
భంజ్‌దేవ్‌ను సన్మానిస్తున్న పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి 

భంజ్‌దేవ్‌కు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిపై హర్షం

సాలూరు, అక్టోబర్‌ 16: రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా సాలూరు నియోజకవర్గానికి అధినేత చంద్రబాబునాయుడు ప్రాధాన్యం ఇస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్టీ కోసం చివరి రక్తపు బొట్టు వరకూ కష్టపడతామని తెలిపారు. విజయదశమి రోజున ఆర్పీ భంజ్‌దేవ్‌కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇవ్వడంపై ఆమెతో పాటు క్యేడర్‌ కూడా అధినేతకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం భంజ్‌దేవ్‌ ఇంటి వద్ద సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్థానిక విలేకరులతో సంధ్యారాణి మాట్లాడారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన భంజ్‌దేవ్‌ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రి చేయటమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని చెప్పారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌ మాట్లాడుతూ పార్టీకి గత వైభవాన్ని తిరిగి తీసుకువస్తామన్నారు. పార్టీలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని పుకార్లు ప్రచారం చేసినా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నియోజకవర్గంలో తెలుగుదేఽశం పార్టీ జెండాను ఎగురవేస్తామన్నారు. తమ చివరి రక్తం బొట్టు వరకు పార్టీ కోసం కృషి చేస్తామన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, పాచిపెంట టీడీపీ మండల అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌బాబు, మత్స శ్యాం, చొక్కాపు త్రినాఽథ,డబ్బి కృష్ణ,చోడవరపు గోవిందరావు, చంద్ర, కొనిసి చిన్ని తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T05:44:57+05:30 IST