త్వరలో సచివాలయాలను సందర్శిస్తాం

ABN , First Publish Date - 2021-09-29T06:40:14+05:30 IST

త్వరలో వార్డు సచివాలయాలను ఆకస్మికంగా సందర్శిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

త్వరలో సచివాలయాలను సందర్శిస్తాం
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

సమీక్షా సమావేశంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

భీమునిపట్నం, సెప్టెంబరు 28: త్వరలో వార్డు సచివాలయాలను ఆకస్మికంగా సందర్శిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం భీమిలి క్యాంప్‌ కార్యాల యంలో ఆయన జీవీఎంసీ 1, 2, 3 వార్డుల పరిధిలోని సచివాలయాల సెక్రటరీలు, అడ్మిన్లు, సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ ఆదేశాల మేరకు గ్రామ సచివాలయాలు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా సేవలందించేందుకు ఈ సందర్శనలు చేపట్టనున్నామన్నారు. సచివాలయాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను వీలైనంత త్వరితంగా పరిష్కరించాలని, సాంకేతిక కారణాలతో నిలిచిన సమస్యలను తమ దృష్టికి తెస్తే తగిన చర్యల కోసం ఉన్నతాధికారులతో సంప్రతిస్తామన్నారు. గులాబ్‌ తుఫాన్‌ సృష్టించిన విలయంతో గ్రామాల్లో మంచినీరు, విద్యుత్‌, పారిశుధ్యం, తదితర ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా శాఖాధికారులు కూడా ఆయా సమస్యల పరిష్కా రంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్తంశెట్టి మహేశ్‌, జెడ్సీ ఎస్‌వీ రమణ, తహసీల్దార్‌ కేవీ ఈశ్వరరావు, వైసీపీ నాయకులు అక్కరమాని రామునాయుడు, ఎ.నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-29T06:40:14+05:30 IST