క్లినికల్‌ ట్రయల్స్‌ చేస్తున్న దేశాలకు టీకాలిస్తాం

ABN , First Publish Date - 2020-09-25T08:16:23+05:30 IST

విమర్శలు ఎదుర్కొంటున్న చైనా ఇప్పుడా విమర్శల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తోంది...

క్లినికల్‌ ట్రయల్స్‌ చేస్తున్న దేశాలకు టీకాలిస్తాం

దౌత్య సంబంధాల మెరుగుకు చైనా యత్నం


బీజింగ్‌, సెప్టెంబరు 24: వుహాన్‌లో ఆవిర్భవించిన కరోనా వైరస్‌ వ్యాప్తి విషయాన్ని దాచి ఉంచిందని విమర్శలు ఎదుర్కొంటున్న చైనా ఇప్పుడా విమర్శల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అడుగులు వేస్తోంది. చివరి స్థాయి లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్న బ్రెజిల్‌, ఇండోనేషియా, టర్కీ వంటి దేశాలకు కరోనా టీకాను సరఫరా చేస్తామని ఆ దేశ టీకా అభివృద్ధి సంస్థ సినోవ్యాక్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ తెలిపింది.  


Updated Date - 2020-09-25T08:16:23+05:30 IST