హామీలు నెరవేరిస్తేనే.. గ్రామాలు ఖాళీ చేస్తాం

ABN , First Publish Date - 2022-08-10T05:21:27+05:30 IST

హామీలు నెరవేరిస్తేనే.. గ్రామాలు ఖాళీ చేస్తాం

హామీలు నెరవేరిస్తేనే.. గ్రామాలు ఖాళీ చేస్తాం
నిరసన తెలియజేస్తున్న ఎయిర్‌పోర్టు నిర్వాసితులు

- అధికారుల మాటలకు మోసపోయాం

- గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్వాసితులు

భోగాపురం, ఆగస్టు 9: గతంలో అధికారులు ఇచ్చిన హామీలు నెరవేర్చితేనే గ్రామాలను ఖాళీ చేస్తామని, లేకుంటే కదిలేది లేదని భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్వాసితులు తేల్చిచెప్పారు. కవులవాడ పంచాయతీ మరాడపాలెం, బొల్లింకలపాలెం గ్రామాలకు చెందిన నిర్వాసితులు మంగళవారం లింగాలవలస సమీప ఆర్‌అండ్‌ ఆర్‌ కాలనీలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... ఎయిర్‌ పోర్టు నిర్మాణంలో భాగంగా తమ గ్రామాలను, భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నా రు. ఆ సమయంలో తమకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్లతోపాటు 18 ఏళ్లు నిండిన యువతకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేస్తామని, పూర్తిస్థాయిలో గ్రామాలను ఖాళీ చేసే సమయానికి అర్హులైన యువతకు కూడా ప్యాకేజీ అందజేస్తామని అప్పట్లో అధికా రులు నమ్మించారన్నారు. ఇప్పుడు 18 ఏళ్లు నిండినవారికి ప్యాకేజీ ఇవ్వమంటే ఎవరూ పట్టించుకోవడం లేదని, అధికారుల మాటలకు మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. బతుకుతెరువు కోసం వలస వెళ్లిన 75 కుటుంబాలతోపాటు 18 ఏళ్లు నిండినవారు 56 మంది యువతకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని, లేకుంటే గ్రామాలను ఖాళీ చేసే ప్రసక్తే లేదన్నారు. అలాగే కాలనీలో గ్రామదేవతల ఆలయాలతోపాటు అంగన్‌వాడీ కేం ద్రం, శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామా లకు చెందిన కోరాడ తాతారావు, కొండనాగ కొత్తయ్యరెడ్డి, ముడసర్ల దేవి, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:21:27+05:30 IST