నకిరేకల్‌ మునిసిపాలిటీని మోడల్‌సిటీగా మారుస్తాం

ABN , First Publish Date - 2021-05-09T05:54:30+05:30 IST

నకిరేకల్‌ మునిసిపాలిటీని మోడల్‌ సిటీగా మారుస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

నకిరేకల్‌ మునిసిపాలిటీని మోడల్‌సిటీగా మారుస్తాం
నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్మన శ్రీనివాస్‌ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

  ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్‌, మే 8 :
నకిరేకల్‌ మునిసిపాలిటీని మోడల్‌ సిటీగా మారుస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్మన రాచకొండ శ్రీనివాస్‌ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  చైర్మన, వైస్‌ చైర్‌పర్సనతో పాటు పాలకవర్గం రాజకీయాలకు అతీతంగా మునిసిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, విద్యుత శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి సహకారంతో ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయి ంచి మునిసిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. కరోనా విపత్కర పరిస్థితిలో మున్సిపల్‌ పాలకవర్గం ప్రజ ల్లో చైతన్యం కల్పించేందుకు కృషి చేయాలని ప్రతి వార్డులో చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండే విధం గా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్‌పర్సన మురారిశెట్టి ఉమారాణి, కమిషనర్‌ ఎన.బాలాజీ, మేనేజర్‌ మున్వ ర్‌ అలీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 
ముస్లిం కుటుంబాలకు దుస్తుల పంపిణీ
రంజాన పండగ సందర్భంగా ముస్లిం నిరుపేద కుటుంబాలకు  ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దుస్తులు పంపిణీ చేశారు. ప్రతీ ముస్లిం కుటుంబం రంజాన పండుగను ఘనంగా జరుపుకోవాలన్న సహృదయంతోనే సీఎం కేసీఆర్‌ దుస్తులు పంపిణీ చేస్తున్నారన్నారు. అనంతరం నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రా మానికి చెందిన ఎం.చంద్రయ్యకు ముఖ్యమంత్రి సహాయనిధి నుం చి మంజూరైన రూ.4లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో నకిరేకల్‌ మార్కెట్‌ చైర్‌పర్సన నడికుడి ఉమారాణి, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి పాల్గొన్నారు. 
దశరథ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
కట్టంగూర్‌ :
మండలంలోని అయిటిపాముల విద్యుత సబ్‌స్టేషన్‌లో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ ఆనారోగ్యంతో ఇటీవల మృతిచెందాగా మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే లింగయ్య పరామర్శించారు.

Updated Date - 2021-05-09T05:54:30+05:30 IST