బీజేపీకి తగిన గుణపాఠం చెబుతాం : ఎంఆర్‌పీఎస్‌

ABN , First Publish Date - 2022-08-11T04:46:01+05:30 IST

స్సీ వర్గీక రణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీజేపీ కి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని ఎమ్మార్పీఎస్‌ తంబళ్ళపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దుమ్ము చిన్నా హెచ్చరించారు.

బీజేపీకి తగిన గుణపాఠం చెబుతాం : ఎంఆర్‌పీఎస్‌
వినతిపత్రం సమర్పిస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

బి.కొత్తకోట ఆగస్టు 10 : ఎస్సీ వర్గీక రణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీజేపీ కి రాబోయే ఎన్నికల్లో  తగిన గుణపాఠం చెబుతామని ఎమ్మార్పీఎస్‌ తంబళ్ళపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దుమ్ము  చిన్నా హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఎమ్మార్పీఎస్‌ నాయకులు బుధ వారం రెవెన్యూ కార్యాలయంలో వీఆర్వో అమరనారాయణకు విన తిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా దానిని అమలు చేయక పోవడం దారుణమన్నారు.  ఎమ్మార్పీఎస్‌ నాయకులు భవాని వెంకటేష్‌, చౌడప్ప, రమణ, గణపతి, రవి, రాముడు, శంకర, లక్ష్మన్న  పాల్గొన్నారు. 

పెద్దతిప్పసముద్రం: ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వినతి పత్రాన్ని ఎమ్మార్పీఎస్‌ నాయకులు రెవెన్యూ కార్యాలయంలో అందచేశారు.  మండల ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు ఎర్రకోటచంద్ర, , చిన్నరామప్ప, కాట్నగల్లు బాబు, వెంక టేష్‌, బూచిపల్లె శీనా పాల్గొన్నారు. 

తంబళ్లపల్లె: ఎస్సీ వర్గీకరణ సాధించే వరకూ ఉద్యమిస్తామని ఎమ్మార్పీఎస్‌ తంబళ్లపల్లె నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటేష్‌ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బుధవారం నాయకులు నల్ల జెండాలతో ప్రదర్శన చేశారు. వారు మాట్లాడుతూ..ఎస్సీ వర్గీకరణ మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష అన్నారు.  కార్యక్రమం లో  ఏటా మల్లికార్జున, జగదీష్‌, శ్రీనివాస్‌, మారప్ప, రెడ్డెప్ప, వెంకటరమణ, గంగాధర, హరి, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-11T04:46:01+05:30 IST