వైవీయూ అభివృద్ధికి సహకరిస్తాం

ABN , First Publish Date - 2020-06-07T11:18:15+05:30 IST

వైవీయు నూతన ఆడిటోరియం నిర్మాణం అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలను పూర్తి చేస్తామని ఎంపీ అవినా్‌షరెడ్డి వీసీ సూర్యకళావతితో

వైవీయూ అభివృద్ధికి సహకరిస్తాం

ఆగిన భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపడతాం: వీసీ 


కడప (వైవీయు), జూన్‌ 6 : వైవీయు నూతన ఆడిటోరియం నిర్మాణం అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలను పూర్తి చేస్తామని ఎంపీ అవినా్‌షరెడ్డి వీసీ సూర్యకళావతితో అన్నారు. శనివారం అవినా్‌షరెడ్డి యూనివర్శిటీని సందర్శించారు. వైవీయూలో ఆగిపోయిన భవన నిర్మాణాలు, విద్యార్థులకు సౌకర్యాలు తదితర విషయాలపై ఎంపీ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి నిధుల కోసం సహకరించాలని కోరారు.


ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్శిటీ వీసీ దొరైరాజ్‌, కిశోర్‌, వైవీయూ వీసీని కలిసి నూతనంగా ఏర్పాటు చేయనున్న ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్శిటీ సంబంధించి చర్చించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 500 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభించేందుకు భవనాలను పరిశీలించారు. యూనివర్శిటీలో వసతుల గురించి ఆయన వీసీ సూర్యకళావతిని అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2020-06-07T11:18:15+05:30 IST