నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటాం

ABN , First Publish Date - 2022-08-11T05:13:02+05:30 IST

మండలంలోని యన్మన్‌గండ్ల చెరువు కట్ట తెగి పోయి నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకునేందుకు కృషిచేస్తామని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటాం
రైతులతో మాట్లాడుతున్న ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి

- యన్మన్‌గండ్ల చెరువుకట్టను పరిశీలించిన ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి

నవాబ్‌పేట, ఆగస్టు 10 : మండలంలోని యన్మన్‌గండ్ల చెరువు కట్ట తెగి పోయి నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకునేందుకు కృషిచేస్తామని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం యన్మన్‌గండ్ల చెరువుకట్టను స్థానిక నాయ కులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులతో మాట్లాడారు. చెరువు కింద సుమారు 300 ఎకరాల్లో వరినాట్లు వేశారని, కట్ట తెగిపోవడం వల్ల ఈ రైతులకు తీవ్రనష్ఠం జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. చెరువుకట్ట మరమ్మతు పనులు సత్వరం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటా మన్నారు. అంతకుముందు జిల్లా అదనపు కలెక్టర్‌ సీతారామారావు, తహసీల్దార్‌ రాజేందర్‌రెడ్డితోకలిసి చెరువు కట్టను పరిశీలించారు. 78 హెక్టార్లలో వరిపంట పొలాల్లో ఇసుకమేటలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. నష్ఠపోయిన ప్రతిరైతుకు ప్రభుత్వం పరిహారం అందించాలని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దుశ్యంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్‌ నర్సింహులు, కృష్ణగౌడ్‌, అంజయ్య, నర్సింహులు, సంజీవ్‌రెడ్డి, తాహెర్‌, సర్పంచ్‌ గోపాల్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T05:13:02+05:30 IST