భవన నిర్మాణాలు వేగవంతం చేస్తాం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-12T06:28:26+05:30 IST

ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణాలు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు.

భవన నిర్మాణాలు వేగవంతం చేస్తాం: కలెక్టర్‌

కర్నూలు(కలెక్టరేట్‌), ఆగస్టు 11: ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణాలు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం జగనన్న స్వచ్ఛ సంకల్పం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణం, జల్‌జీవన్‌ మిషన్‌, అమృత్‌ సరోవర్‌ ట్యాంకులు అమలు తదితర అంశాలపై పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సి పల్‌ సెక్రటరీ జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో పాల్గొన్న కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ సచివాలయ భవనాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లీనిక్‌లు డిజిటల్‌ లైబ్రరీలు సంబంధించిన భవన నిర్మాణాలన్ని పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటు న్నామని వివరించారు. డ్వామా పీడీ అమర్నాథ్‌ రెడ్డి, నాగరాజు నాయుడు, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, పంచాయితీ రాజ్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

కర్నూలు(అర్బన్‌): విద్యార్థులు చదువుకునేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి భరో సాగా నిలిచారని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. గురువారం నగరంలోని కేవీఆర్‌ కళాశాలలో అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమచేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, మేయర్‌తో కలిసి హాజరయ్యారు. ఏప్రిల్‌-జూన్‌ నెలల్లో అందాల్సిన రీయింబర్స్‌మెంట్‌ను బాపట్ల నుంచి సీఎం జగన్మోహన్‌రెడ్డి బాపట్లలో నిర్వహించిన కార్యక్రమం నుంచి బటన్‌ నోక్కి నేరుగా వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద 46,084 మంది తల్లుల ఖాతాలలో రూ.24.84 కోట్లు జమచేసిందన్నారు. కార్యక్రమంలో మేయర్‌ బీవై రామయ్య, డిప్యూటీ మేయర్‌ సిద్దారెడ్డి రే ణుకా, సోషల్‌ వెల్పేర్‌ డీడీ ప్రతాప్‌ సూర్యనారాయణ, ప్రిన్సిపాల్‌ ఇందిరా శాంతి పాల్గొన్నారు.


Updated Date - 2022-08-12T06:28:26+05:30 IST