చీకటి జీఓలు రద్దు చేయకపోతే సత్తా చూపుతాం

ABN , First Publish Date - 2022-01-27T06:59:54+05:30 IST

చీకటి జీఓలు రద్దుచేయకపోతే మాసత్తా ఏమిటో చూపుతామని పీఆర్‌సీ సాధనసమితి నాయకులు పేర్కొన్నారు.

చీకటి జీఓలు రద్దు చేయకపోతే సత్తా చూపుతాం

- పీఆర్‌సీ సాధన సమితి నాయకులు 

- అంబేడ్కర్‌ విగ్రహానికి వినతులు

ధర్మవరం, జనవరి 25: చీకటి జీఓలు రద్దుచేయకపోతే మాసత్తా ఏమిటో చూపుతామని పీఆర్‌సీ సాధనసమితి నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర పీఆర్‌సీ సాధన సమితి పిలుపు మేరకు బుధవారం ఎన్జీఓ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి నాయకులు బీకే ముత్యా లప్ప, మల్లికార్జునరెడ్డి, రవీంద్రరెడ్డి, భాస్కర్‌రెడ్డి,  రామ కృష్ణనాయక్‌, సుధా కర్‌, రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ మేనేజర్‌ ఆనంద్‌, రవి, శ్రీని వాసులు, దుర్గాప్రసాద్‌, అనిల్‌ కుమార్‌రెడ్డి, రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కదిరి: పీఆర్‌సీ సాధన కమిటీ రాష్ట్ర పిలుపు మేరకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పీఆర్‌సీలో జరిగిన అన్యాయాన్ని వినతిపత్రం రూపంలో బుధవా రం పట్టణంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి సమ ర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు బండా రు గంగాధర్‌, ఆది, బయన్న, నారాయణ, యూటీఎఫ్‌ శ్రీనివాసులు, ఎస్‌టీయూ రామ్మోహన్‌ ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీఎం యూనియన్‌ నుండి నాగరాజు, టీఎస్‌యూఎస్‌ చింతా నాగరాజు, వైఎస్‌ఆర్‌టీఎఫ్‌ జంషీర్‌, ప్రధానోపాధ్యాయుల సంఘం బాబుసురేష్‌, ఎన్‌జీవో సంఘం వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-27T06:59:54+05:30 IST