Abn logo
Jan 25 2021 @ 01:01AM

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తాం

బేల, జనవరి 24: గ్రామీ ణ యువకుల్లోని క్రీడా నెపు ణ్యాన్ని వెలికితీయడానికి మైదానాలు ఏర్పాటు చేస్తా మని ఎమ్మెల్యే జోగు రామ న్న అన్నారు. ఆదివారం మం డలంలోని సైదాపూర్‌లో క్రికెట్‌ పోటీలను ప్రారంభిం చారు. గ్రామీణ ప్రాంతంలో జోగుఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భూమి కొనుగోలుచేసి మినీ స్టేడియం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. చదు వుతో పాటు క్రీడల వైపు యువకులు దృష్టి పెట్టాలని తెలిపారు. అనంతరం సీసీ రోడ్డు, సామాజిక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాది గ్రామానికి చెందిన విఠల్‌ కుటుంబాన్ని పరామర్శిం చారు. ఇందులో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మనోహర్‌, సర్పంచ్‌లు సుమన్‌బాయి రాథోడ్‌, ఇంద్రశేఖర్‌, తేజరావు, విపిన్‌, ఎంపీటీసీ యమున్‌, కో ఆప్షన్‌ సభ్యుడు తన్వీర్‌ఖాన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement