స్వాహా సొమ్ము రికవరీ చేస్తాం

ABN , First Publish Date - 2020-10-29T06:39:44+05:30 IST

రాజారాంపేట సహకార సంఘంలో స్వాహా చేసిన ఎరువుల సొమ్మును రికవరీ చేస్తామని, స్వాహా సొమ్ము ఎంతో తేల్చటానికి ప్రత్యేక బృందాన్ని పంపుతున్నామని జిల్లా సహకార అధికారి విజయకుమారి తెలిపారు.

స్వాహా సొమ్ము రికవరీ చేస్తాం

క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం

రాజారాంపేట సొసైటీకి ప్రత్యేక బృందం

జిల్లా సహకార అధికారి విజయకుమారి


నేలకొండపల్లి, అక్టోబరు 28: రాజారాంపేట సహకార సంఘంలో స్వాహా చేసిన ఎరువుల సొమ్మును రికవరీ చేస్తామని, స్వాహా సొమ్ము ఎంతో తేల్చటానికి ప్రత్యేక బృందాన్ని పంపుతున్నామని జిల్లా సహకార అధికారి విజయకుమారి తెలిపారు. బుధవారం డీసీఓ చెర్వుమాధారంలోని రాజారాంపేట సహకార సంఘం కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వాహా సొమ్ము ఎంత ఉంటుందని డీసీవోను ‘ఆంధ్రజ్యోతి’ అడగ్గా రూ.20 లక్షలుగా ప్రాఽథమికంగా అంచనా వేసామని, ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. నాలుగు సంవత్సరాలుగా రాజారాంపేట సొసైటీకి వచ్చిన ఎరువులపై మొత్తం విచారణ జరుపుతామన్నారు.. దీనికి ఎవరిని భాద్యులుగా గుర్తించారని డీసీవోను ప్రశ్నించగా పాత పాలకవర్గం, సీఈవో, సేల్స్‌మెన్‌లందరూ భాద్యులేనన్నారు. నాలుగు సంవత్సరాలుగా చేసిన ఎరువుల వ్యాపారం మొత్తాన్ని ఆడిట్‌ చేస్తామని, స్వాహా చేసిన సొమ్మును పైసాతో సహా రికవరీ చేస్తామన్నారు. ఆపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని డీసీవో స్పష్టం చేశారు. ఆడిట్‌కు ప్రత్యేక బృందాన్ని పంపుతున్నామని, 3రోజుల్లో పూర్తిస్ధాయి నివేదికను తెప్పించుకుని చర్యలు తీసుకుంటామన్నారు. సహకార సంఘాల్లో అవినీతిని ఎంత మాత్రం సహించబోమని  స్పష్టం చేశారు.   

Updated Date - 2020-10-29T06:39:44+05:30 IST