అర్హులందరికీ పథకాలు అందిస్తాం

ABN , First Publish Date - 2022-08-20T05:45:33+05:30 IST

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని శాప్‌ నెట్‌ చైర్మన్‌, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

అర్హులందరికీ పథకాలు అందిస్తాం
ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహిస్తున్న కృష్ణచైతన్య

బల్లికురవ, ఆగస్టు 19: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని శాప్‌ నెట్‌ చైర్మన్‌, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. శుక్ర వారం మండలంలోని ఎస్‌ఎల్‌గుడిపాడు పంచాయతీలోని సుజాతనగర్‌ కాలనీ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా కృష్ణచైతన్య ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివ రించారు. అనంతరం అయన మాట్లాడుతూ గ్రామాలలో ఏమైనా సమస్యలు ఉంటే గ్రామ సచివాలయాల్లో తెలియజేస్తే సత్వరమే పరిష్కారమయ్యేలా అధి కారులు చర్యలు చేపడతారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హమీ లను అమలుచేస్తుందని చెప్పారు. ప్రజలంతా ఆదరించాలని కోరారు. కార్యక్ర మంలో ఏఎంసీ వైస్‌చైర్మన్‌ చింతల పేరయ్య, చింతల శ్రీనివాసరావు, పసల నాగేశ్వరరావు, సుబ్బారెడ్డి, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంతమాగులూరు: మండలంలోని చవుటిపాలెం గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య పాల్గొ న్నారు. గ్రామంలో  ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు.  ఇంకా అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వా రు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయన వెంట పార్టీ నేతలు అట్ల పెద వెంకటరెడ్డి, చింతా శ్రీధర్‌, జడ్పీటీసీ అడవి శ్రీను తదితరులు ఉన్నారు. 


ప్రజలకు మెరుగైన సేవలు అందించటమే లక్ష్యం

పర్చూరు, అగస్టు 19: ప్రజలకు మెరుగైన సేవ లు అందించటమే ప్రభు త్వ లక్ష్యమని వైసీపీ ని యోజకవర్గ ఇన్‌చార్జి రా వి రామనాథంబాబు అ న్నారు. శుక్రవారం ప ర్చూరులో  జరిగిన గడ ప గడపకు మన ప్రభు త్వం కార్యక్రమంలో ఆ యన మాట్లాడారు. ప్ర భుత్వ పథకాలను ప్రజలకు పారదర్శకంగా అందించాలన్న సంకల్పంతో వలం టీర్‌, సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసిం దన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మల్లా అంజమ్మ, మండల పార్టీ కన్వీనర్‌ కఠారి అప్పారావు, కోటా హరిప్రసాద్‌, యద్దనపూడి హరిప్రసాద్‌, ఒగ్గిశెట్టి శివనాగప్రసాద్‌, కోటా శ్రీని వాసరావు, షేక్‌.కాలేషా, చెంచుబాబు, గాదే సురేష్‌, తులసి రాజా తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-08-20T05:45:33+05:30 IST