Abn logo
Jul 31 2021 @ 00:39AM

దరఖాస్తుదారులందరికీ రేషన్‌ కార్డులు అందిస్తాం

ఆదిలాబాద్‌లో రేషన్‌కార్డులను పంపిణీ చేస్తున్న జోగు రామన్న

ఆదిలాబాద్‌, జూలై30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్‌కార్డులు అందిస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం పట్టణంలోని టీటీడీసీలో నిర్వహించిన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. దళిత బంధు పేరుతో ప్రతి దళిత కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించేందుకు రూ.10వేల కోట్లతో ప్రత్యేక పథకాన్ని రూపొందించడం జరిగిందన్నారు. కానీ బీజేపీ నాయకులు అనవసరమై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం రూ.3కోట్లతో నిర్మించనున్న కేజీబీవీ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, జహరీరంజాని, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, ప్రహ్లాద్‌, సేవలక్ష్మి, రమేష్‌, జగదీశ్‌ తదితరులున్నారు.

ఇంద్రవెల్లి: రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్‌ నూతన రేషన్‌కార్డులు పంపిణీకి శ్రీకారం చుట్టారని ఖానాపూర్‌ ఎమ్మె ల్యే రేఖానాయక్‌ అన్నారు. శుక్రవారం స్థానిక మార్కెట్‌ యార్డులో జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ అంజద్‌, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ డోంగ్రే మారుతితో కలిసి కొత్తగా మంజూరై న రేషన్‌ కార్డులు, కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశా రు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రాఘవేంద్రరావు, సర్పంచ్‌ కోరేంగ గాంధారి సుంకట్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాథోడ్‌ మోహన్‌నాయక్‌, ఎంపీటీసీ గిత్తే ఆశాబాయి, జాదవ్‌ స్వర్ణలత, రాజేశ్వర్‌, గణేస్‌, సర్కాలే శివాజీ, షేక్‌ సూపియాన్‌, దేవపూజ మారుతి ఉన్నారు.

సిరికొండ: మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని పది గ్రామాలకు చెందిన 41 మందికి రేషన్‌ కార్డులు, ముగ్గురికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేఖానాయక్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు కడుపునిండా అన్నం పెట్టాలనే లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులను పంపిణీ చేస్తున్నామన్నారు. మండలంలోని సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్య క్రమంలో ఎంపీపీ పెందూర్‌ అమృత్‌రావ్‌, తహసీల్దార్‌ సర్పరాజ్‌ నవాజ్‌, డీటీ హీరాలాల్‌, ఆర్‌ఐ యజ్వెందర్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ గోర్బండ్‌ బాలాజీ, టీఆర్‌ఎస్‌ నాయకులు అశోక్‌, బషీర్‌, జాదవ్‌ లచ్చిరాం, గంగాధర్‌ పాల్గొన్నారు.