రాజీవ్‌ పార్కును అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాం

ABN , First Publish Date - 2022-05-25T05:24:43+05:30 IST

రాజీవ్‌ రిక్రియేషన్‌ పార్కును అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి తెలిపారు.

రాజీవ్‌ పార్కును అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాం
గజ్వేల్‌ పట్టణంలోని రాజీవ్‌ పార్కును పరిశీలిస్తున్న మునిసిపల్‌ చైర్మన్‌ రాజమౌళి

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి

గజ్వేల్‌, మే 24: రాజీవ్‌ రిక్రియేషన్‌ పార్కును అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి తెలిపారు. మంగళవారం మునిసిపాలిటీ పరిధిలోని 12వ వార్డు, 15, 10వ వార్డుల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా 10, 12వ వార్డుల్లో మురుగు కాలువల సమస్యను, 15వ వార్డులో రాజీవ్‌పార్కు పనులను పరిశీలించి మాట్లాడారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మురుగు కాలువల పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఆయనవెంట మునిసిపల్‌ కమిషనర్‌ విద్యాధర్‌, ఏఈఈ కిష్టన్న, ఎస్‌ఐ మల్లికార్జున్‌, కౌన్సిలర్లు అత్తెల్లి శ్రీనివాస్‌, రహీం, ఉప్పల మెట్టయ్య తదితరులున్నారు. 

Updated Date - 2022-05-25T05:24:43+05:30 IST