ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపిస్తాం

ABN , First Publish Date - 2022-05-12T06:30:32+05:30 IST

ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించేలా కృషిచేస్తున్నామని, నూతన ఆలోచనలతో ప్రయాణికులకు దగ్గర కావాలని చూస్తున్నామని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. సిటీ బస్సుల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ చైర్మన్‌గా నన్ను ప్రకటించగానే ఎండీగా ఉన్న సజ్జనార్‌ ఇద్దరు కలిసి ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తారని ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేశాయన్నారు. కానీ ఇద్దరం కలిసి ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపిస్తాం

ఆర్టీసీని ప్రయాణికులు ఆదరించాలి  

జిల్లాలో బస్టాండ్‌ల అభివృద్ధికి కృషి

సిటీ బస్సుల ప్రారంభోత్సవంలో ఆర్టీసీ చైర్మన్‌, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌

సుభాష్‌నగర్‌, మే 11: ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించేలా కృషిచేస్తున్నామని, నూతన ఆలోచనలతో ప్రయాణికులకు దగ్గర కావాలని చూస్తున్నామని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. సిటీ బస్సుల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ చైర్మన్‌గా నన్ను ప్రకటించగానే ఎండీగా ఉన్న సజ్జనార్‌ ఇద్దరు కలిసి ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తారని ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేశాయన్నారు. కానీ ఇద్దరం కలిసి ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.   నేను చైర్మన్‌కాక ముందు సంస్థ ఆదాయం రోజుకు రూ.7 నుంచి రూ.8 కోట్లు మాత్రమే వచ్చేదని ప్రస్తుతం ప్రతిరోజూ రూ.11 కోట్ల నుంచి 15 కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు. జిల్లాలో బస్టాండ్‌ల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రయాణికులు సంస్థను ఆదరించి అభివృద్ధికి తొడ్పడాలని కోరారు. ప్రస్తుత బస్టాండ్‌ ప్రయాణికుల సంఖ్యకు సరిపోవడం లేదని స్థలం దొరకగానే నూతన బస్టాండ్‌ నిర్మించి ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌ను మెడికల్‌ కాలేజీకి ఇచ్చేస్తామని తెలిపారు. ఈ విషయం ముఖ్యమంత్రి పరిధిలో ఉందని వారి నిర్ణయం కోసం వేచిచూస్తామని తెలిపారు. అనంతరం అర్బన్‌ ఎమ్మెల్యే  బిగాల గణేష్‌గుప్తా మాట్లాడుతూ.. పేదప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా చాలారోజులు కష్టపడి రూట్‌మ్యాప్‌ డిజైన్‌ చేశామని తెలిపారు. నూతన బస్టాండ్‌ సిటీ నడిఒడ్డులో ఉండాలని ఉద్దేశంతోనే స్థలంకోసం వేచిచూస్తున్నామన్నారు. ఖమ్మంకు దీటుగా నగర బస్టాండ్‌ను నిర్మిస్తామని తెలిపారు. ప్రతీ పది నిమిషాలకోసారి సిటీ బస్సు వస్తుందని ఆటోలో ప్రయాణించరాదని.. ఇవి ఫలితాలు ఇస్తే మరిన్ని సిటీ బస్సులను నడుపుతామని రిజనల్‌ మేనేజర్‌ ఉషాదేవి తెలిపారు. ప్రస్తుతకాలంలో డీజిల్‌, పెట్రోల్‌ రేట్లు పెరగడంతో ఆటోలో ప్రయాణం ఖర్చుతో కూడుకున్నదని సిటీ బస్సులో ప్రయాణించాలని నగర మేయర్‌ నీతూకిరణ్‌ అన్నారు. అనంతరం సిటీ బస్సులను ప్రారంభించి బస్సులో ప్రయాణించారు. నగంలోని ప్రధానవీధులగుండా  క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌, ఎస్‌డీవో చైర్మన్‌ సాంబారి మోహన్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ చిత్రమిశ్రా, అదనపు డీసీపీ వినిత్‌, మాజీ మేయర్‌ ఆకుల సుజాత, ఆర్టీసీ డీవీఎం విజయభాను, డిపో 1, 2 మేనేజర్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.

Read more