నిర్మల్‌ను ప్రగతిపథంలో నిలబెడతాం

ABN , First Publish Date - 2021-06-19T06:26:05+05:30 IST

పల్లెలు, పట్టణ ప్రాంతాలు పరిశుభ్రంగా, పచ్చ దనంతో ఉండేలా చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

నిర్మల్‌ను ప్రగతిపథంలో నిలబెడతాం
పట్టణ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

28 కోట్ల రూపాయలతో మరిన్ని అభివృద్ధి పనులు

పట్టణ ప్రగతిలో భాగంగా అభివృద్ధి, సుందరీకరణ పనుల పరిశీలనలో మంత్రి అల్లోల

నిర్మల్‌ టౌన్‌, జూన్‌ 18 : పల్లెలు, పట్టణ ప్రాంతాలు పరిశుభ్రంగా, పచ్చ దనంతో ఉండేలా చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లో పట్టణ ప్రగతిలో భాగంగా శివాజీచౌక్‌ నుండి అంబేద్కర్‌ చౌరస్తా వరకు రూ. 5.50 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డువెడల్పు, సుందరీకరణ పనులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ గ్రామ, పట్టణ ప్రాంతాలకు నెలనెల నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. నిర్మల్‌ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, రోడ్ల విస్తరణ పనులకు కూడా వ్యాపారులు, పట్టణ ప్రజలు పూర్తిగా సహకరించడంతో పనులు చకచకా సాగుతున్నాయని పేర్కొన్నారు. అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ నిర్మల్‌ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు. రానున్న రోజుల్లో రూ. 28 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. పట్టణ ప్రగతితో ముందుగా పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చుకుని ఎక్కడ కూడా చెత్తలేకుండా శుభ్రంగా ఉంచుకోవా లని సూచించారు. ఎవరి ఇంటిపరిసరాలను వారే పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా చూసి ఇంటికి వచ్చే చెత్త బండిలో వేయాలని సూచించారు. పారిశుద్ధ్యం లోపించకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, కమిషనర్‌ బాలకృష్ణ, మాజీ డీసీసీబీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పూదరి నరహరి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ప్రముఖ వ్యాపార వేత్త ఆమెడ కిషన్‌, కౌన్సిలర్లు గండ్రత్‌ రమణ, నేరెళ్ల వేణు, తదితరులు పాల్గొన్నారు. 

ఆలయాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

సారంగాపూర్‌, జూన్‌ 18 : ఆలయాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని న్యాయ,పర్యావరణ,అటవీ,దేవాదాయశాఖమంత్రి అల్లోలఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పోట్యాలో సార్గమ్మ ఆలయ ప్రారంభో త్సవానికి హాజరై ఆలయంలో పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో  సన్మానించారు. ఈ నేపథ్యంలో రూ.10 లక్షల చొప్పున గ్రామంలో మూడు దేవాలయాల నిర్మాణాలకు నిధులను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు నిర్మల్‌ జిల్లాలో 500 దేవాలయాలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఆడెల్లి దేవాలయాన్ని రూ.20 కోట్ల మాస్టర్‌ప్లాన్‌తో ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరయ్యాయని, వాటి పనులను వెంటనే ప్రారంభిస్తామని తెలిపారు. ఆలయానికి వచ్చి పోయే భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే ప్రతీతండాకు అంతర్గత రోడ్లను నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుసమితి కో ఆర్డినేటర్‌ వెంకట్‌రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌ ఐటీ చందు, సొసైటీ చైర్మన్‌ నారాయణ్‌రెడ్డి, నాయకులు గంగన్న దత్తురాం, మల్లేష్‌, శ్రీనివాస్‌రెడ్డి, నారాయణరెడ్డి, మధుకర్‌రెడ్డి, ఆదిలతో పాటు గ్రామస్థులు ఉన్నారు. 


Updated Date - 2021-06-19T06:26:05+05:30 IST