‘భూమాయ’పై విచారణ జరిపిస్తాం

ABN , First Publish Date - 2021-06-24T04:43:14+05:30 IST

పెద్దపల్లె రెవెన్యూ గ్రామంలో భూమాయపై విచారణ జరిపిస్తామని తప్పు చేసినట్లు తేలితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు.

‘భూమాయ’పై విచారణ జరిపిస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి

తప్పు చేసినట్లు తేలితే ఎంతటి వారైనా ఉపేక్షించం : ఎమ్మెల్యే మేడా


సిద్దవటం, జూన్‌ 23 : పెద్దపల్లె రెవెన్యూ గ్రామంలో భూమాయపై విచారణ జరిపిస్తామని తప్పు చేసినట్లు తేలితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. బుధవారం మాధవరంలో జరిగిన జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  ఈనెల 21వ తేదీ ఆంధ్రజ్యోతి పత్రికలో ‘భూమాయ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించారు. ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల్లో ప్రభుత్వ భూములను బయటి వ్యక్తులు ఆన్‌లైన్‌ చేయించుకున్నట్లు పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సమగ్రంగా విచారించి నిజంగానే ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి పాల్పడినా, బయటి వ్యక్తులు ఆన్‌లైన్‌ చేయించుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదల భూములు పేదలకే చెందాలని పేదలకు తాము అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.  కార్యక్రమంలో తహసీల్దారు రమాకుమారి, ఎంపీడీవో ప్రతాప్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏకుల రాజేశ్వరిరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు జ్యోతి జగదీశ్వర్‌రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ నీలకంఠారెడ్డి, మాధవరం సర్పంచ్‌ జానకి రామయ్య, ఎంపీటీసీలు డేరంగుల శివయ్య, లక్ష్మీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T04:43:14+05:30 IST