శింగనమల కోటలో టీడీపీ జెండా ఎగరవేస్తాం

ABN , First Publish Date - 2021-10-20T06:01:32+05:30 IST

సార్వత్రిక ఎన్నికల్లో శింగనమలలో టీడీపీ జెండా ఎగరవేస్తామని నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు ఉద్ఘాటించారు.

శింగనమల కోటలో టీడీపీ జెండా ఎగరవేస్తాం
ఆత్మీయ కలయికలో మాట్లాడుతున్న ముంటిమడుగు కేశవరెడ్డి.. వేదికపై ఆలం నరసానాయుడు, ఎంఎస్‌ రాజు, చంద్రదండు ప్రకాష్‌నాయుడు, గాండ్ల విశాలాక్షి, రామలింగారెడ్డి


ఆత్మీయ కలయికలో ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు, ఆలం

గార్లదిన్నె, అక్టోబరు 19 : సార్వత్రిక ఎన్నికల్లో శింగనమలలో టీడీపీ జెండా ఎగరవేస్తామని నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు ఉద్ఘాటించారు. మంగళవారం మండల కేంద్రంలో టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయకలయిక సమావేశం నిర్వహించారు. ద్విసభ్య కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శింగనమల క్రాస్‌ నుంచి సభ వేదిక వరకు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. కల్లూరుకు చెందిన బేడ, బుడగ సంఘం మండలాధ్యక్షుడు బాబయ్య, అమరనాథ్‌రెడ్డి, మసుద్‌, మల్లయ్య ఆధ్వర్యంలో క్రేన సాయంతో రెండు గజమాలలతో ఘనంగా సత్కరించారు. ద్విసభ్య కమిటీ సభ్యులు.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, వాల్మీకి మహార్షి, శ్రీ భక్త కనకదాస విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. బస్టాండు సర్కిల్‌లో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు.. మాట్లాడుతూ టీడీపీకి విధేయులుగా ఉంటూ కష్టపడిన కార్యకర్తలకు సముచిత స్థానం తప్పక లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో పార్టీ ఎవరికి టికెట్‌ ఇచ్చినా ఐకమత్యంతో పనిచేసి, తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కలసి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం  అన్నివర్గాల సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నా రు. వైఎస్‌ జగన.. కురబ, గాండ్ల, యాదవ, మాల, మాదిగ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి, ఇప్పటికీ వారికి జీతాలు కూడా ఇవ్వలేదన్నారు. మాంసాభివృద్ది సంస్థ మాజీ చైర్మన చంద్రదండు ప్రకా్‌షనాయుడు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.


భారీ ర్యాలీతో కార్యకర్తల్లో నూతనోత్సాహం

నాయకులు, కార్యకర్తలు శింగనమల క్రాస్‌ నుంచి ఆత్మీయ కలయిక వేదిక వరకు చేపట్టిన భారీ ర్యాలీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపింది. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు హాజరవడం కార్యకర్తలకు బలాన్నిచ్చింది. ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చుతూ, డప్పువాయిద్యాల మధ్య పూలవర్షం కురిపిస్తూ సాగారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు  జయరాం, అశోక్‌, ఎర్రన్న, జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్‌బాబు, పార్లమెంటు నియోజకవర్గ నిర్వాహక కార్యదర్శి ఇల్లూరు రామాంజి, ముంటిమడుగు శ్రీనివా్‌సరెడ్డి, ఆలం వెంకటనరసానాయుడు, నాగరాజు, మాజీ జడ్పీటీసీలు రామలింగారెడ్డి, విశాలాక్షి, గుర్రం ఆదినారాయణ, గేటు క్రిష్ణారెడ్డి, గుత్తా బాలకృష్ణ, కురుబ సంఘం మండలాధ్యక్షుడు పాండు, వడ్డే వన్నూరు, బాబయ్య, సురేంద్రరెడ్డి, నరసింహారెడ్డి, చితంబరప్ప, పయ్యావుల నరసయ్య, ఆవుల కిష్ట, తిరుమలేసు, గోరకాటి వెంకటేసు, ఎర్రిస్వామి, సుబ్బరాయుడు, విశ్వనాథ్‌, దండు శ్రీనివాసులు, డేగల కృష్ణమూర్తి, సుదర్శననాయుడు, మారుతీనాయుడు, వ్యాసాపురం బాబు, రాము, ప్రసాద్‌, పుల్లన్న, సుధాకర్‌రెడ్డి, బాషా, జిలాన, సుంకన్న, కొర్రపాటి శేఖర్‌, రమణప్ప, శ్రీనివాసులు, రమణచౌదరి, శీనప్ప, మల్లికార్జున, శ్రీరాములు, సింహాద్రి, మస్తాన, అంజి, గంగాధర్‌ పాల్గొన్నారు.




Updated Date - 2021-10-20T06:01:32+05:30 IST