Abn logo
Apr 9 2020 @ 05:55AM

పేదలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌ 8: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో పేదలు ఇబ్బంది పడకుండా ఆదుకుంటామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం బేల మండలానికి వెళ్లిన ఎమ్మెల్యే నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులు పడుతున్న మండల కేం ద్రంలోని పేద ప్రజలకు రూ.20వేల విలువ గల నిత్యావసర సరుకులను అందజేశారు. అయి తే కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రజలం దరూ సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించి పూర్తిగా సహకరించాలని కోరారు. ప్రభుత్వం ద్వారా ఇప్పటికే పేదలకు రేషన్‌ దుకాణాల నుంచి ఒక్కొక్కరికి 12కిలోల చొప్పున అందించడం జరుగుతుందన్నారు. ఇందులో పలువురు నాయకులున్నారు.


ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం..

బేల మండలంలో ప్రారంభంకానున్న శనగ కొనుగోళ్ల ఏర్పాట్లను బుఽధ వారం ఎమ్మెల్యే జోగు రామన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కు ఒక రోజు ముందుగానే వచ్చిన శనగలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అయితే ప్రభుత్వం ముందుగా సూచించిన రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు. ఇందులో గ్రంథాలయ చైర్మన్‌ రౌతు మనోహార్‌, మండల వ్యవసాయ, మార్కెట్‌ అధికారులు, నాయకులున్నారు. 

Advertisement
Advertisement