గ్రామం తరలిస్తేనే భూములు ఇస్తాం

ABN , First Publish Date - 2021-12-09T06:14:46+05:30 IST

గ్రామాన్ని తరలిస్తేనే భూములను ఇస్తామని లాలంకోడూరు రైతులు తేల్చి చెప్పారు. బుధవారం ఏపీఐఐసీ అర్‌ఐ కేబీఆర్‌ గోపాలమూర్తి, సర్వేయర్‌ వాసుదేవరావు రైతులతో సమావేశమయ్యారు.

గ్రామం తరలిస్తేనే భూములు ఇస్తాం
రైతులతో మాట్లాడుతున్న ఏపీఐఐసీ అధికారులు

ఏపీఐఐసీ అధికారులకు తేల్చిచెప్పిన లాలంకోడూరు రైతులు


రాంబిల్లి, డిసెంబరు 8: గ్రామాన్ని తరలిస్తేనే భూములను ఇస్తామని లాలంకోడూరు రైతులు తేల్చి చెప్పారు. బుధవారం ఏపీఐఐసీ అర్‌ఐ కేబీఆర్‌  గోపాలమూర్తి, సర్వేయర్‌ వాసుదేవరావు రైతులతో సమావేశమయ్యారు. 2017లో గ్రామ రెవెన్యూలోని బ్లాక్‌ నంబరు 23లోని 122 నుంచి 130 వరకు ఉన్న సర్వే నంబర్లులో 80.46 ఎకరాలను ఏపీఐఐసీ భూసేకరణ చేసిందని, ఈ భూముల్లో సుమారు వంద మంది రైతులు ఉన్నారని ఆర్‌ఐ గోపాలమూర్తి తెలిపారు. ఇప్పటికే కొంత మంది రైతులు ముందుకు వచ్చి ఎకరాకు రూ.19 లక్షల చొప్పన నష్టపరిహారం తీసుకున్నారని చెప్పారు. భూములు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న రైతులతో మాట్లాడి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. కాగా, కంపెనీలకు అతి సమీపంలో ఉన్న తమ గ్రామాన్ని తరలించినప్పుడే భూములు ఇస్తామని మరి కొంత మంది రైతులు స్పష్టం చేశారు. సమస్యలను కాగితం రూపంలో ఇస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లాలం రమణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T06:14:46+05:30 IST