జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం

ABN , First Publish Date - 2022-09-29T03:34:59+05:30 IST

జర్నలి స్టుల సమస్యలపై టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్రవర్కింగ్‌ జర్నలి స్టుల సంఘం రాష్ట్రఅధ్యక్షుడు నగునూరి శేఖర్‌ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రం లోని ఎస్‌ఎంగార్డెన్స్‌లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా ద్వితీయ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసం గించారు.

జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం
మహాసభలో మాట్లాడుతున్న టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్‌

- టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్రఅధ్యక్షుడు నగునూరి శేఖర్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 28: జర్నలి స్టుల సమస్యలపై టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్రవర్కింగ్‌ జర్నలి స్టుల సంఘం రాష్ట్రఅధ్యక్షుడు నగునూరి శేఖర్‌ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రం లోని ఎస్‌ఎంగార్డెన్స్‌లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా ద్వితీయ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసం గించారు. టీయూడబ్ల్యూజేతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పాలకులు జర్నలిస్టుల సంక్షేమం పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఐక్యంగా ఉండి హక్కులసాధనకై పోరాడాలని పిలుపు నిచ్చారు. అంతకుముందు టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరుణాకర్‌ మాట్లాడుతూ మేనిఫె స్టోలో జర్నలిస్టుల కోసం ఇచ్చినహామీలు ఇప్పటివరకు నెరవేర్చక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. అంతకు ముందు తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అజ్మీర శ్యాంనాయక్‌ మాట్లా డుతూ జర్నలిస్టులు ఐక్యంగాఉండి సమస్యలు పరి ష్కరించుకోవాలన్నారు. ఈసందర్భంగా సభకు వచ్చిన అతిథులకు జిల్లాశాఖ తరపున ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. వివిధ సంఘాల నుంచి టీయూడబ్ల్యూజే(ఐజేయూ)లో 30మంది జర్నలిస్టులు చేరారు.

Updated Date - 2022-09-29T03:34:59+05:30 IST