విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంబికె భవన్ చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నుంచి వినతులను స్వీకరించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
అందుకే జనవాణి
‘‘పాలకులు హామీలను ఇవ్వడమే తప్ప.. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదు. నేను సొంతంగా కొంత వరకు సాయం చేయగలను. పూర్తిగా సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రభుత్వాలకే సాధ్యం. ప్రజలకు పాలకులు అందుబాటులో లేరు. అందుకే నేను జనవాణి కార్యక్రమం చేపట్టాను. సీఎం నివాసం వద్ద భద్రత పేరుతో తమ ఇల్లు ఖాళీ చేయించారని ఒక మహిళ నన్ను కలిసింది. అధికార పార్టీ నేతలు ఆ కుటుంబాన్ని వేధించారు. వాళ్ల అన్నయ్య అనుమానాస్పద స్థితిలో మరణించారు. కూరగాయలు తీసుకు వస్తానని వెళ్లిన వ్యక్తి శవమయ్యాడు. ఆ మరణానికి నేటి వరకు కారణం ఏమిటో చెప్పలేదు. ఈ ఘటన నన్ను చాలా కదిలించింది. ఎంతోమంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకోలేక పోతున్నారు. అందుకే ప్రజలు దగ్గరకే మేం వెళ్లి కలుస్తున్నాం. మేము అధికారంలో లేకున్నా సమస్యలు పట్ల సానుకూలంగా స్పందిస్తాం. అర్జీలు స్వీకరించాక వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. క్రిమినల్స్‌కి అండగా ఉండే పార్టీ వైసీపీ. మంత్రులు, నాయకత్వం నిందితులను వెనుకేసుకొస్తోంది. అధికారులపై ఎటువంటి ఒత్తిడిలు ఉన్నాయో వారే చెప్పాలి. జనసేన పక్షాన మీకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. ’’ అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి