కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తే.. భారత ఆర్మీ అధికారి కీలక వ్యాఖ్య

ABN , First Publish Date - 2021-02-28T03:29:45+05:30 IST

పాకిస్థాన్, భారత సంయుక్తంగా ఇటీవలే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించాయి. సరిహద్దు వద్ద శాంతి నెలకొల్పేందుకు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో భారత్ ఆర్మీ అధికారి ఒకరు శనివారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తే..  భారత ఆర్మీ అధికారి కీలక వ్యాఖ్య

కుప్వారా: పాకిస్థాన్, భారత సంయుక్తంగా ఇటీవలే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించాయి. సరిహద్దు వద్ద శాంతి నెలకొల్పేందుకు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో భారత్ ఆర్మీ అధికారి ఒకరు శనివారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందాన్ని పాక్ మళ్లీ తుంగలో తొక్కి కాల్పులకు తెగబడితే..తాము తొందరపాటు ప్రదర్శించమనీ  వీలైంతనగా సమ్యమనం పాటిస్తామని తెలిపారు. ‘వీలైనంత వరకూ మేము సమ్యమనం పాటిస్తాం. అయితే..ఈ ఒప్పందానికి పాక్ కూడా కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నాం అని మేజర్ జనరల్ వీ ఎమ్‌బీ కృష్ణన్ తెలిపారు.‘ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఇది కొత్త శకానికి నాంది పలకాలని, సరిహద్దు వద్ద శాంతి, అభివృద్ధిని సాధించాలని ఆశిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-02-28T03:29:45+05:30 IST