పల్లెల్లో అభివృద్ధిని పరుగు పెట్టిస్తాం

ABN , First Publish Date - 2021-06-21T06:50:07+05:30 IST

గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటన ద్వారా సమస్యలను అధ్యయనం చేస్తున్నామని, ఆ తర్వాత సంబంధిత అధికారుల సమన్వ యంతో పల్లెల్లో అభివృద్ధిని పరుగు పెట్టిస్తామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు.

పల్లెల్లో అభివృద్ధిని పరుగు పెట్టిస్తాం
కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేస్తున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

బీబీనగర్‌, జూన్‌ 20: గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటన ద్వారా సమస్యలను అధ్యయనం చేస్తున్నామని, ఆ తర్వాత సంబంధిత అధికారుల సమన్వ యంతో  పల్లెల్లో అభివృద్ధిని పరుగు పెట్టిస్తామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీబీనగర్‌ మండలంలోని జంపల్లి, నీలతండా, గుర్రాల దండి, పెద్దపలుగు తండాల్లో ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకు లతో కలిసి పర్యటించారు. వీధి వీధి తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరోనాతో మృతి చెందిన 14 కుటుంబా లకు పైళ్ల ట్రస్ట్‌ ద్వారా ఆర్థికసాయం అందజేసి ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలోనే భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు తెలిపారు. విడతల వారీగా ఆయా మండలాల్లోని గ్రామాల్లో పర్యటించి ప్రధాన సమ స్యలను ప్రజలను అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అంతర్గత సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మా ణాలతో పాటు తాగునీటి సమస్యలు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజలను సమస్యలు తెలియజేస్తే పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌, జడ్పీటీసీ ప్రణీతా పింగల్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి,  రైతు సమన్వయ సమితి  మండల కన్వీనర్‌ బొక్క జైపాల్‌రెడ్డి,  వైస్‌ఎంపీపీ గణేష్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాయమల్ల శ్రీనివాస్‌, నాయకులు సుదర్శన్‌రెడ్డి, మల్ల గారి శ్రీనివాస్‌, బీరునాయక్‌ విద్యానాయక్‌ ఉన్నారు. 



Updated Date - 2021-06-21T06:50:07+05:30 IST