గౌరవెల్లి భూనిర్వాసితులకు న్యాయం చేస్తాం

ABN , First Publish Date - 2022-06-24T05:30:00+05:30 IST

గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులను ప్రభుత్వం పరంగా ఆదుకొని న్యాయం చేస్తామని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మాలోతు లక్ష్మీ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

గౌరవెల్లి భూనిర్వాసితులకు న్యాయం చేస్తాం

ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకరించాలి

త్వరలోనే గండిపల్లి ప్రాజెక్టు పనులు చేపడతాం

హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌


అక్కన్నపేట, జూన్‌ 24: గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులను ప్రభుత్వం పరంగా ఆదుకొని న్యాయం చేస్తామని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మాలోతు లక్ష్మీ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ మాట్లాడుతూ భూ నిర్వాసితులు ప్రతిపక్ష పార్టీల మాయలో పడొద్దని, రావాల్సిన పరిహారం డబ్బు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన 500 మంది యువతీయువకులకు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు భూ నిర్వాసితులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతే త్వరలోనే గండిపల్లి ప్రాజెక్టు పనులు చేపడతామని తెలిపారు. అంతకుముందు సర్వసభ్య సమావేశంలో విద్యుత్‌, మిషన్‌ భగీరథ, పంచాయతీ రాజ్‌, ఎక్సైజ్‌ శాఖలకు సంబంధించిన పలు అంశాలను సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ భూక్య మంగ, ఎంపీడీవో కొప్పుల సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ సంజీవ్‌ కుమార్‌, అధికారులు తదితరులు 

Updated Date - 2022-06-24T05:30:00+05:30 IST