Abn logo
Sep 17 2021 @ 01:12AM

ముంపు బాధితులకు న్యాయం చేస్తాం..

గ్రామస్థులతో మాట్లాడుతున్న అధికారులు

తాడిమర్రి, సెప్టెంబరు 16: చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం ద్వారా ముం పునకు గురవుతున్న గుడ్డంపల్లి గ్రామానికి చెందిన బాధితులకు న్యాయం జరిగేలా చూ స్తామని సీబీఆర్‌ విభాగపు ఈఈ రాజశేఖర్‌, ధర్మవరం ఇన్‌చార్జ్‌ ఆర్డీఓ రవీంద్ర అన్నారు. గురువారం మండలంలోని గుడ్డంపల్లి గ్రామాన్ని డీఈ ఈశ్వరయ్య, జేఈ విజయ్‌కుమార్‌తో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామమంతా కలియతిరిగి ముంపుకు గురవుతున్న ఇళ్ల వివరాలను నమోదు చేసుకున్నారు. సీబీఆర్‌ సామర్థ్యం పెంచిన తరువాత అదనంగా ఇళ్లు మునుగుతున్నాయని, గతంలో పరిహారం అందని వారికి మాత్రమే ఇప్పుడు అందించే అవకాశం ఉందన్నారు. తగిన ప్రణాళికపై అధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపను న్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్‌విండో చైర్మన్‌ భువనేశ్వరరెడ్డి, తహసీల్దార్‌ హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.