Abn logo
Jun 23 2021 @ 23:37PM

అర్హులందరికీ న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే

మైలవరం, జూన్‌ 23: ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారందరికీ న్యాయం చేస్తామని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సచివాలయం వద్ద ఎంపీడీవో రామచంద్రారెడ్డి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు హాజరైన ఆయన హాజరయ్యారు. ఈసందర్భం గా తమ సమస్యలు పరిష్కరించాలని పలువురు వినతి పత్రాలు సమర్పించా రు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట్లాడుతూ అర్హుత ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారికి తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. జమ్మలమడుగు మార్కెట్‌యార్డు చైర్మన్‌ శివగురివిరెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.